రెడ్డి గారికీ టైమొచ్చింది

మన కమెడియన్ లు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా మారారు. ఆయన హీరోగా సీనియర్ డైరెక్టర్ ధవళ సత్యం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం `అలెగ్జాండర్`. `ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం` అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో ఆయన ఒక్కరే నటిస్తుండటం విశేషం. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
‘ఏందిరా... అబ్బి’ అంటూ తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన రాయలసీమ యాసతో గుర్తింపుపొందారు జయప్రకాశ్ రెడ్డి. గతంలో ఇలానే ఇద్దరితో కూడిన ప్రయోగాత్మక సినిమా తెరకెక్కించారు. షో అనే సినిమా పేరుతో మహేష్ బాబు అక్క మంజులా, నటుడు సూర్యలను ఇద్దరినీ పెట్టి షో అనే సినిమా తెరకెక్కించారు. ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి అలాంటి సినిమా తెరకేక్కనుండడం విశేషం. ఆయన ఇదివరకు ఎక్కువగా విలన్ పాత్రలు పోషించేవారు, బాలయ్య - జయప్రకాశ్ రెడ్డి కాంబినేషన్ ఇప్పటికీ హాట్ కేక్ అనే చెప్పాలి. అయితే ముంబై విలనిజం పెరిగాక ఆయన నెమ్మదిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ గా స్థిరపడిపోయాడు.