English   

విడాకుల వైపు మరో టాలీవుడ్ జంట.. అమ్మాయి ఎవరంటే..

 Tollywood Divorce
2019-10-22 14:42:08

మంచు మనోజ్ విడాకులతో అభిమానులు ఇప్పటికే షాక్ అయ్యారు. ఈ విషయం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన విడాకుల విషయాన్ని అంత త్వరగా అభిమానులు మరచిపోలేరు. పెళ్లయి మూడేళ్లు కూడా కాకముందే భార్యతో విడిపోయాడు ఈ మంచు వారబ్బాయి. దానికంటే ముందు అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకున్న తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. విశాల్, అనీషా రెడ్డి పెళ్లి కూడా ఆగిపోతుందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వాళ్ళ పెళ్ళి జరగడం ఖాయం అని విశాల్ తండ్రి రెడ్డి విషయం కాని కన్ఫర్మ్ చేశారు. ఇలాంటి సమయంలో మరో టాలీవుడ్ జంట ఇప్పుడు విడాకుల వైపు అడుగులు వేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఒక పెద్దింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఒక చెన్నై బిజినెస్ మాన్ ఆమెతో కాపురం చేయలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పుట్టింట్లోనే ఉన్న అమ్మాయి అత్తారింటికి రావడానికి నిరాకరిస్తూ ఉండటంతో విడాకులే శరణ్యం అని ఆ బిజినెస్ మాన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అమ్మాయి తరపు బంధువులు కూడా ఏమీ మాట్లాడక పోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ లో ఒక పెద్ద హీరో కూతురు కొన్నేళ్ల కింద చెన్నై బిజినెస్ మాన్ తో ఏడు అడుగులు నడిచింది. కొన్నేళ్లపాటు బాగానే సాగినా కాపురం ఇప్పుడు మనస్పర్థల కారణంగా విడాకులు వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ విషయంలో ఇరు కుటుంబాలు కూర్చొని మాట్లాడుతున్నా కూడా పెద్దగా ఫలితం లేకపోవడంతో చట్టప్రకారం విడిపోవడానికి సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. చెన్నై బేస్డ్ బిజినెస్ మాన్, ఒక స్టార్ హీరో కూతురు అంటే ఎవరో ఇట్టే అర్ధమైపోతుంది. కాస్త ఆలోచిస్తే తెలిసిపోతుంది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో విడాకుల ట్రెండ్ మళ్ళీ మొదలైంది.
 

More Related Stories