English   

అమితాబ్ మాటలకు షాకైన మెగాస్టార్ చిరంజీవి 

Amitabh
2019-10-22 17:48:55

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ మూవీ సైరా థియేటర్స్ లో ఇంకా రన్ అవుతోంది. సైరాలో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, చిరంజీవి గురువుగా నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్య అమితాబ్ అనారోగ్య సమస్యతో హాస్పటల్ లో జాయిన్ అవడంతో చిరంజీవి ముంబాయ్ వెళ్ళి బిగ్ బి ని పరామర్శించాడు. ఈ సందర్భంలో అమితాబ్ మాటలు విన్న చిరంజీవి ఉలిక్కిపడినంత పనైందని ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బిగ్ బిని పరామర్శించడానికి వెళ్లిన చిరంజీవిని అమితాబ్ సైరా కలక్షన్స్ గురించి అడిగినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ గా పదవి చేపట్టబోతున్నందుకు కంగ్రాట్స్ అంటూ చిరంజీవిని అభినందించాడట. 

దీంతో బిగ్ బి మాటలకు చిరు షాక్ అయినట్లు సమాచారం. వెంటనే తనకు రాజకీయాల మీద ఆసక్తి పోయిందని ఏ పదవుల మీద మోజు లేదని అమితాబ్ తో అన్నాడట. అంతేకాదు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి తనవంతుగా ఏదైనా చేస్తా కానీ ఎలాంటి పదవి ఆశించడం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవికే తెలియని ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ విషయం అమితాబ్ బచ్చన్ వరకు ఎలా వెళ్లిందనేది టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య చిరంజీవి సైరా సినిమా చూడాలని ఏపీ సీఎం జగన్ ని కలిసిన విషయం తెలిసిందే. ఆ విషయం పలు రకాలుగా ప్రచారం అయ్యి ఇప్పుడు ఏకంగా బ్రాండ్ అంబాసిడర్ పేరిట ప్రచారం కావడంతో చిరు షాక్ అయ్యాడట.  
 

More Related Stories