రాజమౌళి మీద మండిపడుతున్న జూనియర్ ఫ్యాన్స్

బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా కలం అయ్యింది. ఇప్పటి వరకు దాదాపుగా 40శాతం వరకు షూటింగ్ పూర్తయింది. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏవోక ఆటంకాలు కలుగుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు సంబంధించిన ఓ లుక్ రిలీజ్ చేశారు. అది కూడా సగం సగం మొహాలతో ఉన్న ఫోటో. ఆ తరువాత సినిమా నుంచి అఫీషియల్ గా ఎలాంటి లుక్ రిలీజ్ చేయలేదు. దసరాకు ఏదైనా లుక్ వస్తుంది అనుకుంటే అది లేదు.
ఈరోజు కొమరం భీం జయంతి. ఈ రోజున ఈ మూవీకి సంబంధించిన ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారేమో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూశారు. కానీ, ఫ్యాన్స్ ఆశలు అడియాశలుగా మారాయి. అయితే, ఆర్ఆర్ఆర్ సినిమా ట్విట్టర్ లో ఓ మెసేజ్ షేర్ చేసింది. ‘‘స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన ధీరుడు కొమురం భీమ్. ఆయన జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. ‘ఆర్.ఆర్.ఆర్’లో ఎన్టీఆర్‌ను యంగ్ భీమ్‌గా వెండితెరపై చూపించేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం’’ అంటూ ఓ ట్వీట్ చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహానికి అంతు లేకుండా పోయింది.
ఈ ట్వీట్ పై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కొమరం భీంజయంతి రోజున కనీసం ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేస్తారని అనుకోని ఆశగా ఎదురు చూస్తుంటే.. ఇలా షాక్ ఇస్తారా అని మండిపడుతున్నారు. ఫోటో రిలీజ్ చేయకుండా ఇలాంటి మెసేజ్ ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ఫన్నీ ఫోటోలు ట్వీట్ చేసి మరీ జక్కన్నని ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30న రిలీజ్ చేయనున్నట్టు యూనియ్ ఇప్పటికే ప్రకటించింది. అయితే అనుకోని కారణాల వల్ల చిత్రీకరణ ఆలస్యంగా సాగుతోన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమాను దసరాకు వాయిదా వేయబోతున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.