English   

ఆన్‌లైన్ రమ్మీ ఆడమంటున్న కాజల్ అగర్వాల్..

kajal
2019-10-23 05:07:44

ఆన్ లైన్ రమ్మీ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. వేలకు వేలు కాదు లక్షలకు లక్షలు కూడా బెట్స్ వేసుకుని మరీ ఈ గేమింగ్ ఎంజాయ్ చేస్తుంటారు. కొన్ని రాస్ట్రాల్లో అయితే దీన్ని బ్యాన్ కూడా చేసారు. అయితే ఇప్పుడు ఈ గేమింగ్ సంస్థ తమ ఆటను మరింత ముందుకు తీసుకెళ్లడానికి స్టార్ హీరోయిన్ కాజల్ సాయం తీసుకుంటున్నారు. ఇక కాజల్ కూడా వీళ్లతో చేతులు కలిపింది. ఖేల్ ప్లే రమ్మి అంటూ వచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దీనికి బ్రాండింగ్ చేయడానికి ఒప్పుకుంది కాజల్. ఈ ఆటను అందరిలాగే తాను కూడా బాగా ఇష్టపడతానని.. ఖాళీ సమయంలో రమ్మి ఆడుతుంటానని చెప్పింది ఈ చందమామ. ఇప్పుడు ఈ గేమ్ లో తాను భాగమవడం నిజంగానే సంతోషంగా ఉందని చెబుతుంది కాజల్ అగర్వాల్. ఈ గేమ్ ఆన్ లైన్ లో మంచి స్థానంలో ఉందని.. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం రమ్మిని వరల్డ్ వైడ్ చేయడం అని చెబుతుంది.

ఇండియాలోనే నెంబర్ స్థానంలో ఉన్న ఈ గేమ్.. రానున్న రోజుల్లో డిజిటల్ యుగంలో మరింత ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది కాజల్ అగర్వాల్. డిజిటల్ ప్లాట్ ఫాం ద్వారా ఖేల్ ప్లే రమ్మీ ఈ తరాన్ని మరింత ప్రోత్సహిస్తుందని చెబుతుంది కాజల్. 2023 నాటికి భారతదేశం ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమ 11900 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించనుందని అంచనా ఉందని కాజల్ లెక్కలు కూడా చెబుతుంది. మొత్తానికి కాజల్ రాకతో తమ సంస్థకు మరింత లాభాలు వస్తాయని.. రాబడి పెరుగుతుందని ఆశిస్తున్నారు రమ్మీ సంస్థ. మరి చూడాలిక.. ఏం జరుగుతుందో..?

More Related Stories