English   

టాలీవుడ్ లో ఐటీ రైడ్స్ కలకలం 

IT raids on Sunil Narang
2019-10-23 10:31:40

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఐటీ రైడ్స్ కలకలం చెలరేగుతూనే ఉంది. రాజకీయ నాయకులు, ఆధ్యాత్మిక వేత్తలు, కాంట్రాక్టర్ లను ఎవరినీ వదలని ఐటీ తాజాగా సినిమా రంగం మీద కూడా ఫోకస్ చేసినట్టు చెబుతున్నారు. ఏసియన్ సినిమాస్ తెలుగులో డిస్త్రిబ్యూషన్ నుండి మొదలై ఫైనాన్సియర్స్ గా ఎదిగి ఆ తర్వాత సినిమా థియేటర్స్ బిజినెస్ లోకి కూడా ఎంటర్ అయ్యి ఇప్పుడు నెంబర్ వన్ ప్లేస్ లో నడుస్తోన్న సంస్థ అది. వీరు మహేష్ బాబుతో కలిసి ఏఎమ్.బి సినిమాస్ తో పార్టనర్ షిప్ పెట్టుకున్నారు. ఈ ఏఎంబీ పేరిట మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ను దేశవ్యాప్తంగా విస్తరించే ప్రయత్నాల్లోనూ ఉన్నారు. 

నారాయణ దాస్ నారంగ్, సునిల్ నారంగ్ దాస్ నిర్వహిస్తోన్న ఈ సంస్థ రీసెంట్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా మొదలైన సినిమాతో నిర్మాణ రంగం లోకి కూడా అడుగు పెట్టారు. ఇన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉంటోన్నా వీరికి నిర్మాతలుగా ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఇలా ఉన్న సమయంలో ఏసియన్ సినిమాస్ గ్రూప్ పై ఐటి దాడులు జరగడం చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ లో ఉన్న ఏసియన్ సినిమాస్ ఆఫీస్ లు దాస్ ల ఇళ్ళు సహా భాగస్వాముల ఇళ్లు కార్యాలయాల్లోనూ ఐటీ సోదాలు జరిగాయనేది సమాచారం. అయితే ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More Related Stories