English   

బయోపిక్ రేసులో పూజా...న్యాయం చేస్తుందట

PV sindhu
2019-10-23 10:39:47

ప్రస్తుతం అన్ని బాషలలో బయోపిక్స్ సీజన్ నడుస్తోంది. తెలుగులో అయితే ఒకటి రెండు సినిమాలు ఇంకా ట్రాక్ లోనే ఉన్నాయి. ఇక అంత‌ర్జాతీయ పోటీల్లో అనేక ప‌త‌కాలు పొందిన తెలుగు తేజం పీవీ సింధు రీసెంట్‌గా జ‌రిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో స్వర్ణం గెలుచుకోవడంతో ఆమె బయోపిక్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. ఆమెపై బ‌యోపిక్ తీసేందుకు సోనుసూద్ ఎప్పుడో ముందుకు వ‌చ్చారు. ఈ బయోపిక్ ను తాను నిర్మిస్తూనే, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ పాత్రలో కూడా నటించనున్నారు. 

అయితే పీవీ సింధు పాత్ర‌లో ఎవ‌రు న‌టిస్తార‌నే దానిపై కొద్ది రోజులుగా చర్చ‌లు జ‌రుగుతుండ‌గా ఆ మధ్య అక్కినేని కోడ‌లు స‌మంత‌ని ఫైన‌ల్ చేశార‌నే టాక్ వినిపించింది. అయితే ఈ ప్రచారం జరిగిన కొద్ది రోజులకే పీవీ సింధు ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ తన బయోపిక్ కి దీపికా పడుకొన్ అయితే యాపట్ అని చెప్పడంతో ఆ చర్చ మళ్ళీ బాలీవుడ్ వైపు మళ్ళింది. ఇప్పుడు సింధు పాత్రలో నటించబోయే పాత్రలో పూజా హెగ్డే పేరు కూడా చేరింది. ఇటీవల ఒక ఈవెంట్ లో మాట్లాడిన పూజా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

బయోపిక్ పాత్రలు చేయాలనే కోరిక నాకు చాలా ఉంది. పీవీ సింధు పాత్రను నాకు అప్పగిస్తే తప్పకుండా పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పడం ద్వారా ఆ బయోపిక్ మేకర్స్ కి హింట్ ఇచ్చినట్టయింది. మరి పూజా కోరిక మేరకు పీవీ సింధు బయోపిక్ మేకర్స్ ఆమెకు ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. పూజా ఇప్పుడు `హోస్ ఫుల్ 4`లో న‌టించింది. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమాపై పూజా చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఒక‌వేళ `హోస్ ఫుల్ 4` ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తే.. పివి సింధు బ‌యోపిక్ కోసం ఆమెకు ఛాన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

More Related Stories