English   

రామ్ చరణ్ ఆ రీమేక్‌లో నటిస్తే సంచలనాలే.. 

Ram Charan
2019-10-23 17:41:19

ఒకప్పుడు రామ్ చరణ్ సినిమా అంటే మూస అంటూ కొన్ని విమర్శలు వచ్చేవి. ఆయన ప్రయోగాలు చేయడానికి భయపడతాడని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఫిక్స్ అయిపోయారు. ఒక సందర్భంలో తాను ప్రయోగాత్మక కథలు చేయడానికి సిద్ధంగా లేను అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు చరణ్. దాంతో ఆయన పూర్తిగా మూస ఫార్ములాకి ఫిక్స్ అయిపోయాడు. దర్శకులు కూడా కొత్త కథలు తీసుకు రావడం మానేశారు. అలాంటి సందర్భంలో సుకుమార్ రంగస్థలం సినిమా తీసి రామ్ చరణ్ లోని నటుడికి పని చెప్పాడు. దాంతో ఇప్పుడు ఆయన కోసం ప్రయోగాత్మక కథలు క్యూ పడుతున్నాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ చరణ్. ఒకవైపు నటిస్తూనే మరోవైపు తండ్రి సినిమాలు నిర్మిస్తూ రెండు పాత్రల్లోనూ సక్సెస్ ఫుల్ గా ఒదిగిపోయాడు రామ్ చరణ్. 

ఇదిలా ఉంటే తాజాగా రామ్ చరణ్ దగ్గరికి ఒక సంచలన సినిమా వచ్చిందని తెలుస్తుంది. తమిళనాట విడుదలై అద్భుతమైన విజయం సాధించిన అసురన్ సినిమాను తెలుగులో రామ్ చరణ్ తో రీమేక్ చేస్తే ఎలా ఉంటుందని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు పూర్తిగా కన్ఫర్మేషన్ రాకపోయినా కూడా రంగస్థలం సినిమా చేశాడు కాబట్టి ఇలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ కు బాగా సూట్ అవుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే అసురన్ తెలుగు రీమేక్ రైట్స్ కోసం భారీగా పోటీ ఏర్పడింది. ఎవరు రైట్స్ తీసుకున్నా కూడా తెలుగులో రామ్ చరణ్ చేస్తాడని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఒక వేళ ఇదే నిజం అయితే మాత్రం రామ్ చరణ్ అభిమానులకు ఇంతకంటే పండగ మరొకటి ఉండదు. వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ నాట ఘనవిజయం సాధించింది.

More Related Stories