English   

విజిల్ ప్రివ్యూ.. తళపతి విజయ్ ముందు భారీ లక్ష్యం..

vijay
2019-10-23 18:08:09

తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బిగిల్ పేరే వినిపిస్తుంది. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను అట్లీ కుమార్ తెరకెక్కించాడు. దివాళి కానుకగా విడుదల కానుంది ఈ చిత్రం. తెరీ, మెర్సల్ తర్వాత విజయ్, అట్లీ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. దీనిపై తమిళనాటే కాదు తెలుగులో కూడా భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్ కూడా అదిరిపోవడంతో సినిమా విజయంపై నమ్మకంగా కనిపిస్తున్నారు దర్శక నిర్మాతలు. 2 గంటల 53 నిమిషాల నిడివితో విజయ్ బిగిల్ సినిమా వస్తుంది. తెలుగులో ఈ సినిమాకు భారీ లక్ష్యం ఉంది. ఈ చిత్రాన్ని ఒకటి రెండు కాదు.. ఏకంగా 10 కోట్లకు అమ్మేసారు దర్శక నిర్మాతలు. ఇక్కడ భారీగానే విడుదలవుతుంది విజిల్. నైజాంలోనే 200 థియేటర్స్ లో విడుదల కానుంది ఈ చిత్రం. తెలుగులో ఓవరాల్ గా 500కి పైగా స్క్రీన్స్ ఇస్తున్నారు ఈ చిత్రం కోసం. దాంతో పాటు కార్తి ఖైదీ సినిమా విడుదలవుతున్నా కూడా అంచనాలు మాత్రం విజిల్ పైనే ఉన్నాయి.

ఈ చిత్రంలో ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్నాడు విజయ్. దాంతోపాటు మరో మాస్ కారెక్టర్ కూడా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది. అన్నింటికి మించి నయనతార హీరోయిన్ కావడం తెలుగులో కలిసిరానుంది. ఇక సినిమాలో కూడా మరోసారి సందేశాన్ని జోడించి తీసుకొస్తున్నాడు అట్లీ కుమార్. ఈ సారి స్పోర్ట్స్ నేపథ్యంలో జరుగుతున్న అక్రమాలపై కథ రాసుకున్నాడు ఈయన. మెర్సల్ లో మెడికల్ స్కామ్స్ గురించి చూపించిన అట్లీ కుమార్ ఇప్పుడు స్పోర్ట్స్ పై పడుతున్నాడు. కచ్చితంగా ఈ చిత్రం తమిళనాట మరో సంచలన విజయం అందుకుంటుందని ధీమాగా చెబుతున్నారు దర్శక నిర్మాతలు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయ్ తో తెరీ, మెర్సల్ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత అట్లీ చేస్తున్న సినిమా ఇది. అక్టోబర్ 25న విడుదల కానుంది ఈ చిత్రం.

More Related Stories