English   

కార్తి ఖైదీ సినిమాను భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. 

Karthis Khaidi
2019-10-23 18:40:30

కార్తికి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. మార్కెట్ కూడా ఉంది. దాంతో మనోడి సినిమాలకు అక్కడే కాదు ఇక్కడ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కార్తికి తెలుగులో మంచి విజయం రాలేదు. ఊపిరి తర్వాత నటించిన ఖాకీ సినిమా మంచి విజయం సాధించింది. అయితే గతేడాది విడుదలైన చిన్నబ్బాయి.. మొన్నొచ్చిన దేవ్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచాయి. ఇక ఇప్పుడు ఈయన నటిస్తున్న ఖైదీ సినిమాపై ఆసక్తి పెద్దగా కనిపించడం లేదు. పైగా ఈ చిత్రంలో హీరోయిన్ ఉండదు.. పాటలు లేవు అనేసరికి ప్రేక్షకులకు పెద్దగా ఎక్కడం లేదు. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్ 25న విడుదల కానుంది. విజయ్ విజిల్ సినిమాకు పోటీగా ఇది వస్తుంది.

ఇక కార్తికి మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. చిరంజీవి టైటిల్స్ ఈ తరం హీరోలకు అస్సలు కలిసి రావడం లేదు. మొన్నటికిమొన్న నాని కూడా గ్యాంగ్ లీడర్ అంటూ వచ్చి దారుణంగా నిరాశపరిచాడు. దానికి ముందు కూడా కొన్ని ఇలాగే జరిగాయి. ఇలాంటి సమయంలో ఖైదీ అంటూ వస్తున్నాడు కార్తి. కేకే రాధామోహన్ ఖైదీ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నాడు. స్యామ్ CS సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో నరైన్, ధీనా, మరియం జార్జ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. మొత్తానికి మరి చూడాలిక.. ఈ బ్యాడ్ సెంటిమెంట్ దాటితేనే కార్తి కోరుకున్న విజయం చెంత చేరుతుంది. 

More Related Stories