English   

బండ్ల గణేష్ అరెస్ట్.. జూబ్లీహిల్స్ స్టేషన్ లో నిర్మాత..

Bandla Ganesh Arrested
2019-10-23 19:36:57

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈయన్ని జూబ్లిహిల్స్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్ కావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వైసీపీ నేత, నిర్మాత పివిపి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బండ్ల గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. పివిపి ఇంట్లో అర్ధరాత్రి నిర్మాత బండ్లగణేష్ హల్చల్ చేసాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన తన  అనుచరులతో కలిసి వచ్చి వైసీపీ నేత పివిపిని బెదిరించే ప్రయత్నం చేసారని అందులో ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఆయన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. బెదిరింపు కింద జూబ్లీహిల్స్ పిఎస్లో పివిపి పిర్యాదు చేయడంతో ఇప్పుడు నిర్మాత బండ్ల గణేష్ కు స్టేషన్ మెట్లు ఎక్కక తప్పలేదు. ఈయనపై సెక్షన్ 420, 448, 506 r/w 43 ipc కింద కేసు నమోదు చేసారు. అనంతరం బంజారాహిల్స్ ఏసీపీ కార్యాలయానికి బండ్ల గణేష్ ను తరలించారు. 
 

More Related Stories