English   

హిట్ కొడుతున్న నాని.. విశ్వక్ సేన్ హీరోగా రెండో సినిమా.. 

 Nani
2019-10-24 12:01:04

హీరో నాని ఇప్పుడు నిర్మాత కూడా అయ్యాడు. ఈయన నిర్మాణంలో వచ్చిన మొదటి సినిమా అ.. మంచి విజయం సాధించింది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈచిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కూడా. ఈ చిత్రం తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండో సినిమా అనౌన్స్ చేసాడు నాని. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయం చేస్తూ.. హిట్ అనే సినిమా ప్రకటించాడు న్యాచురల్ స్టార్. ఫలక్ నుమా దాస్ సినిమాతో ప్రేక్షకులకు చేరువైన విశ్వక్ సేన్ ఇందులో హీరో. రుహాని శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. చిలసౌతో పరిచయమైన ఈ బ్యూటీ.. ఇప్పుడు వరస అవకాశాలు పట్టేస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాకు హిట్ అనే టైటిల్ కన్ఫర్మ్ చేసాడు దర్శకుడు శైలేష్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కచ్చితంగా ఈ చిత్రంతో హిట్ కొట్టి నిర్మాతగా సత్తా చూపిస్తానని చెబుతున్నాడు నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హిట్ సినిమా నిర్మిస్తున్నాడు న్యాచురల్ స్టార్. 

More Related Stories