English   

నాకో మంచి బాయ్ ఫ్రెండ్ కావాలంటున్న కియారా అద్వానీ.. 

Indoo Ki Jawani
2019-10-24 16:28:09

భరత్ అనే నేను సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. వినయ విధేయ రామ సినిమాతో మరింత దగ్గరైంది కియారా అద్వానీ. ఈ చిత్రం ఫ్లాప్ అయినా కూడా అమ్మాయిగారి అందాలు మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఈ రెండు సినిమాల తర్వాత మళ్లీ తెలుగు వైపు చూడటం లేదు కియారా. కారణం బాలీవుడ్ లో వరస అవకాశాలు వస్తుండటమే. ఇప్పుడు కూడా ఈమె తనకు మంచి బాయ్ ఫ్రెండ్ కావాలని పాటలు పాడేస్తుంది. ప్రస్తుతం హిందీలో వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. అక్కడ ఇప్పుడు 'ఇందూ కీ జవానీ' సినిమాలో నటిస్తుంది. కియారా నటిస్తున్న తొలి ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. అబీర్‌ సేన్‌ గుప్తా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టీ-సిరీస్, ఎమ్మీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్ర కథ అంతా కియారా బాయ్ ఫ్రెండ్ కోసం వెతుక్కువడమే.. తగిన వాడి కోసం చూస్తుంటుంది. ఇదే కథ చుట్టూ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం లక్నోలో జరుగుతోంది. ఇందు పాత్ర చేయడం గురించి కియారా మాట్లాడుతూ.. ఇందు పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని.. ఈ పాత్రకు ప్రతీ అమ్మాయి కనెక్ట్‌ అవుతుందని చెబుతుంది. హాయిగా నవ్వుకునే ఎంటర్‌టైనర్‌ ఇందూ కి జవానీ అంటుంది కియారా. కచ్చితంగా ఈ చిత్రంతో తాను మంచి విజయం సాధిస్తానని నమ్ముతుంది కియారా అద్వానీ. 

More Related Stories