English   

శ్రీముఖి బ్రేకప్ లవ్ స్టోరీ....ఎవరతను ?

Sreemukhi love.jpg
2019-10-25 08:57:02

l బాస్ సీజన్ 3లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా, విన్నర్ అంటూ ప్రచారం జరుగుతూన యాంకర్, నటి శ్రీముఖి తన పర్శనల్ విషయాలను షేర్ చేసుకుంది. ఆమె తన లవ్ స్టోరీని బయటపెట్టింది. నిన్న బిగ్ బాస్ షోని రక్తికట్టించేందుకు ఇంట్రస్టింగ్ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో భాగంగా తమన జీవితంలో జరిగిన ఎవరికీ తెలియని డార్క్ సీక్రెట్‌ను చెప్పాలని, తమ జీవితంలో ఒంటిరిగా ఫీల్ అయి బాధ పడిన సందర్భాలను షేర్ చేసుకోవాలని ఇంటి సభ్యులకు టాస్క్ ఇచ్చారు. ఇక ఈ క్రమంలోనే తన బ్రేకప్ లవ్ స్టోరీ చెప్పుకుంది శ్రీముఖి. 

నా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడూ ఓపెన్ కాలేదని, ఎవరికీ చెప్పలేదని చెబుతూ తన లవ్ స్టోరీ చెప్పింది. గతంలో ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉండేదాన్నని అదే సమయంలో ప్రొఫెషనల్ గా కూడా క్లిక్ అయ్యానని చెప్పింది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బాగుందని అనుకుంటున్న సమయంలో రిలేషన్షిప్ లో మనస్పర్ధలు వచ్చి బ్రేకప్ అయిందని శ్రీముఖి తెలిపింది. దాంతో నా జీవితంలో అగ్లీ బ్రేకప్ ఫేస్ చేశానని అది ఎంత అగ్లీ అంటే. చచ్చిపోదామనే పరిస్థితి వరకూ వెళ్లిందని చెప్పుకొచ్చింది. అయితే అతను ఎవరు అన్నది చెప్పడం నాకు ఇష్టం లేదని పేర్కొంది. 

అలాగే లైఫ్‌లో సెటిల్ కాకుండా లవ్వు గివ్వు అంటూ ఇలాగే ఇబ్బందులు పడాల్సి ఉంటుందని, ఆ తరువాత తెలిసింది నాకు అసలు లైఫ్ అంటే ఇదీ అని. అందుకే ముందు మనం మన పేరెంట్స్.. ఆ తరువాతే మిగితావని చేబుతూ తన లైఫ్‌లో జరిగిన లవ్ స్టోరీ చెప్పుకొచ్చింది శ్రీముఖి. అయితే అతను ఎవరా అనే అనుమానాలు ప్రేక్షకులతో పాటు సాధారణ జనాల్లో కూడా మొదలయింది. తాను ఇప్పటి వరకూ ఎవరితో అతని గురించి చెప్పలేదని చెప్పడం చూస్తే అతను ఇండస్ట్రీ లేదా టీవీకి చెందిన వ్యక్తి ఏనా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి.

More Related Stories