English   

మహేష్ కమర్షియల్ విత్ ఫ్యామిలీ...విమర్శల వర్షం 

Mahesh Babu
2019-10-25 10:22:34

సినిమాల విషయంలోనే కాక తన క్రేజ్ ని చూసుకుని కమర్షియల్స్ లో నటించే విషయంలో కూడా మహేష్‌బాబు అందరి కంటే ఒకడుగు ముందే ఉంటాడు. ప్రస్తుతం ఆయన అనేక సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సదరు సంస్థలు చేసే ప్రకటనల్లోనూ ఆయన తనదైన పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేస్తుంటారు. మహేష్ తన రేంజ్ కి తగ్గ యాడ్స్ లో కాకుండా చిన్న చిన్న సబ్బు - నూనె కంపెనీలకు కూడా ప్రచారాలు చేస్తుంటాడు. అయితే తన సినీ కెరీర్ లో కూడా పెద్దగా హైలైట్ చేయని మహేష్ ఈ సారి ఏకంగా కమర్షియల్ కోసం తన కూతురు కొడుకు సహా భార్యతో నటించడం ఇప్పుడు పలు విమర్శలకి తావిస్తోంది. రీసెంట్ గా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చేసిన యాడ్ లో నమ్రతతో పాటు కూతురు, కొడుకుతో కూడా యాక్టింగ్ చేయించాడు. 

తాజాగా దీనికి సంబంధించిన వీడియో విడుదలైంది. ఈ వీడియోలో మహేష్‌ తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఎంతో సరదాగా అల్లరి చేస్తూ కనిపించారు. నమ్రత సినిమాలకు గుడ్‌బై చెప్పాక తిరిగి రంగుసేకున్నది ఈ యాడ్‌ కోసమే. ఇలా ఒక హీరో తన ఫ్యామిలీ మొత్తంతో కలిసి ఓ ప్రకటనలో నటించడం ఇదే తొలిసారి కావడంతో మహేష్ ఫ్యాన్స్ లో కొందరు ఇది కూడా హిస్టరీ అని ఆనంద పడుతుంటే కొందరు మాత్రం గట్టిగా విమర్శిస్తున్నారు. అయితే ఆ వర్గం విమర్శలు పట్టించుకోవక్కర్లేదని అంటున్నారు మహేష్ అభిమానులు. మహేష్ ఏమి చేసినా అర్ధం ఉంటుందని అర్ధం లేకుండా చేయదని అంటున్నారు. ఇప్పటికే మహేష్ 1001 మంది పిల్లలని ప్రాణాంతక జబ్బుల నుండి కాపాడాడు. అలా చేయడం కోసం ఫ్యామిలీ మొత్తం కలిసి నటిస్తే తప్పేంటి ? అని ప్రశ్నిస్తున్నారు.

More Related Stories