చిరంజీవి ఇంట్లో ఆ స్టార్స్ కి గ్రాండ్ పార్టీ...అందుకే

టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్ వుడ్ కి చెందిన సీనియర్ స్టార్స్ కి టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి పార్టీ ఇవ్వబోతున్నారు. అంటే మొన్న సైరా సినిమా సక్సెస్ కావడంతో ఈ పార్టీ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రతీ ఏడాది 1980లలో స్టార్స్ గా మారిన అన్ని బాషల నటీనటులు అందరూ ఒక చోట కలుస్తూ రీయూనియన్ జరుపుకుంటారు. దీనికి ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ అని పేరు పెట్టుకున్నారు. అప్పటి తరం హీరో, హీరోయిన్లు ఈ వేడుకలో పాల్గొంటారు. ఇందులో మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నరేశ్, అర్జున్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ, ప్రభు, సుమలత, శోభన, సుహాసిని, రాధిక, భాగ్యరాజ్, ఖుష్భూ, శరత్‌కుమార్, సత్యరాజ్(కట్టప్ప), జయరామ్, నదియా, సుమన్ వంటి వాళ్ళు ఉన్నారు. కలిసిన ప్రతిసారి ఓ డ్రెస్ కోడ్ పెట్టుకుని మరీ పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. అలాగే ఒక్కో సంవత్సరం ఒక్కో చోట రీయూనియన్ ప్లాన్ చేస్తుంటారు. దాంతో పాటు టీమ్ లో ఉన్న ఓ స్టార్ ఆ రీ యూనియన్ ని ఆ ఏడాదికి ఒక సారి ఆర్గనైజ్ చేసి పార్టీ ఇస్తుంటారు. ఈ సంవత్సరం ‘క్లాస్ ఆఫ్ ఎయిటీస్’ పదో యానివర్శరీ. టెన్త్ యానివర్శరీ పార్టీ హైదరాబాద్‌లో చిరంజీవి స్వగృహంలో జరగనుందని చెబుతున్నారు. ఈమధ్యనే చిరంజీవి తన నివాసాన్ని కొత్త హంగులతో రీ మోడలింగ్ చేయించారు. కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో కొత్తగా తయారైన ఇంట్లో వేడుక కూడా చేశారు. ఇక రీ–యూనియన్‌కి ఈ ఇల్లే వేదిక కానుందని అంటున్నారు. వచ్చే నెలలో జరగనున్న ఈ పార్టీని మరచిపోలేని విధంగా ప్లాన్ చేయాలనీ చూస్తున్నారట మెగాస్టార్.