English   

వైఎస్ భారతితో మహేష్ బాబు భార్య భేటీ...అందుకేనట 

Namrata
2019-10-25 15:25:13

ప్రిన్స్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఏపీ సీఎం జగన్ భార్య భారతితో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లాలోని తన సొంతూరు బుర్రిపాలెంను దత్తత తీసుకున్న మహేష్ అక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈరోజు భారతిని కలిసిన నమ్రత తన భర్త చేపడుతున్న అన్ని కార్యక్రమాలను ఆమె వివరించారు . శ్రీమంతుడు సినిమా తర్వాత దత్తత కాన్సెప్ట్ ను ప్రమోట్ చేసిన మహేష్ బాబు తెలంగాణలో ఒక గ్రామంతో పాటు ఏపీలో తన తండ్రి స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్నారు. గ్రామంలో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం, రోడ్లు, వీధి లైట్లు, పారిశుద్యం తదితర విషయాల్లో మహేష్ బాబు తన ట్రస్ట్ పేరిట పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందించాలని భారతిని నమ్రత కోరారు. ఈ సందర్భంగా మహేష్ బాబు చేపడుతున్న స్వచ్చంద సేవా కార్యక్రమాలను వైఎస్ భారతి ప్రశంసించినట్టు సమాచారం. భారతితో భేటీకి ముందు నమత్ర విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం వేదపండితులు నమ్రతకు వేద ఆశీర్వచనము చేశారు.

More Related Stories