English   

పవన్ ని అసభ్యంగా చిత్రీకరించిన వర్మ...కావాలనే 

 Ram Gopal Varma
2019-10-25 16:51:48

వివాదాస్పద దర్శకుడు వర్మ ఏం చేసినా వివాదమే ఏం మాట్లాడిన సంచలనమే. వివాదాలకి కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఆర్జీవీ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు వర్మ. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి వర్మ ఈ సినిమాలో ఎవరిని టార్గెట్ చేస్తాడా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సినిమా నుంచి ముందుగా ఒక పాటను విడుదల చేసాడు వర్మ. ఆ పాటతో ఆయన టార్గెట్ చేసేది బాబు అండ్ కో అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. 

ఏపీలోని రెండు అగ్ర కులాలను డైరెక్టుగా మేన్షన్ చేయడమే కాక కమ్మ కులం మీద రెడ్లు ఆధిపత్యం చూపారన్నట్లుగా ఆ టైటిల్ తెలియజేస్తుండటంతో ఒక వర్గం వారు అభ్యంతరాలు తెలియచేస్తున్నారు. టైటిల్‌ను బట్టి ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి వేసీపీ అధికారంలోకి వచ్చిన సందర్భాన్ని ప్రధానంగా తీసుకొని రాంగోపాల్ వర్మ ఈ మూవీని తీస్తున్నాడనేది సుస్పష్టం అయినట్టే. ఎన్నికలకు ముందు చంద్రబాబునే కాకుండా పవన్‌ను టార్గెట్ చేస్తూ కూడా వర్మ కామెంట్లు చెయ్యడం, పవన్‌ను కించపరిచే రీతిలో ఆర్జీవీ చేసిన ట్వీట్లు, కామెంట్లు దుమారం సృష్టించాయి. 

శ్రీరెడ్డి ఉదంతంలో ఆమెను సపోర్ట్ చేస్తూ, పవన్‌పై వర్మ చేసిన ట్వీట్లు ఆయన ఫ్యాన్స్‌కు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఆ సందర్భంలో వర్మను విపరీతంగా ట్రోల్ చేశారు కూడా. అది మనసులో పెట్టుకున్నట్టున్నాడు పవన్ ని స్త్రీ లోలుడిగా అభివర్ణిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు.పవన్ కళ్యాణ్ పాత్రలో నటిస్తున్న వ్యక్తి సభలో మాట్లాడుతుండగా చుట్తో ఇంగ్లీష్ భామలు ఉన్నట్లుగా ఈ స్టిల్ ఉంది.  కమ్మరాజ్యంలో కడప రెడ్లు చిత్ర ట్రైలర్ లోని ఓ పిక్ ఇది. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే అది పూర్తిగా యాధృచ్చికమే అని వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. చూస్తుంటే ఇదేదో కావాలనే పవన్ అభిమానులను రెచ్చగొట్టాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది.  

More Related Stories