అదిరే లుక్ లో విజయశాంతి

లేడీ సూపర్‌స్టార్‌గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తరవాత మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తోంది. మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ద్వారా విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆమె కీలక పాత్ర పోషిస్తున్నారు. దీపావళి సందర్భంగా సరిలేరు నీకెవ్వరు మూవీ నుండి విజయ శాంతి లుక్ విడుదల చేసారు. ఇందులో విజయ శాంతి లుక్ అభిమానులలో ఆసక్తి కలిగిస్తుంది.
విజయశాంతి రాయలసీమకు చెంది పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారని అనుకున్నప్పటికి, తాజాగా విడుదలైన లుక్ చూస్తుంటే ఆమె చాలా డీసెంట్‌గా కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.