బిగిల్ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దండయాత్ర షురూ..

తమిళనాట రజినీకాంత్ తర్వాత ఆ స్థాయి మాస్ ఫాలోయింగ్ ఎంజాయ్ చేస్తోన్న హీరో విజయ్. ఈయన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇప్పుడు బిగిల్ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ చిత్రం తొలిరోజే తమిళ సినిమా రికార్డుల్ని బద్ధలు కొట్టేసింది. తొలిరోజే ఏకంగా 50 కోట్ల గ్రాస్.. 33 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది బిగిల్. తెలుగులో కూడా విజిల్ మంచి వసూళ్లు సాధిస్తుంది. ఇక్కడ తొలి రోజే ఏకంగా 2.60 కోట్ల షేర్ వసూలు చేసింది. విజయ్ సినిమాలకు ఈ స్థాయి ఓపెనింగ్ రావడం నిజంగానే గొప్ప విషయం. సినిమాకు మంచి టాక్ ఉండటంతో కచ్చితంగా వీకెండ్ లోపు దుమ్ము దులిపేస్తుందని నమ్ముతున్నారు బయ్యర్లు. తమిళనాట నాన్ రజినీ కేటగిరీలో అన్ని రికార్డులకు చెక్ చెబుతున్నాడు విజయ్. బిగిల్ తో కచ్చితంగా మరో బ్లాక్ బస్టర్ కొట్టేలా కనిపిస్తున్నాడు ఈ హీరో. ఈ సినిమా తమిళనాట ఒక్కటే 22 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో కూడా విజయ్ మేనియా నడుస్తుంది. అక్కడా రప్ఫాడిస్తుంది బిగిల్. ఇప్పటికే సినిమాకు టాక్ బాగుండటం.. సోషల్ మెసేజ్ ఉన్న కథ కావడం.. స్పోర్ట్స్ మాఫియాపై జరుగుతున్న కాన్ టెంపరరీ కథ కావడంతో బిగిల్ కు బాగా కనెక్ట్ అవుతున్నారు ప్రేక్షకులు. ద్విపాత్రిభినయం కూడా కలిసొస్తుంది. మొత్తానికి బిగిల్ తో రికార్డుల దుమ్ము దులిపేస్తున్నాడు ఇళయ దళపతి.