English   

టాలీవుడ్ పొమ్మంది.. బాలీవుడ్ రమ్మంది.. కృతి కర్బంధా అక్కడ హిట్టే..

Kriti Kharbanda
2019-10-26 14:17:50

తెలుగులో పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లాంటి హీరోలతో నటించినా కూడా ముద్దుగుమ్మ కృతి క‌ర్భందా జాతకం మాత్రం మారలేదు. ప‌దేళ్లుగా తెలుగులో ట్రై చేసినా కూడా సరైన గుర్తింపు రాలేదు. కన్నడలో స్టార్ అయినా కూడా తెలుగులో మాత్రం అస్సలు ఈ బ్యూటీని పట్టించుకోలేదు మన దర్శక నిర్మాతలు. అందాల ఆర‌బోత‌కు సిద్ధంగా ఉన్నా.. అక్క‌ పాత్ర‌ల‌కు సెటిలైపోయినా కృతికి అదృష్టం మాత్రం క‌లిసి రావ‌డం లేదు. చివ‌రికి ప‌వ‌న్ క‌ళ్యాణ్, రామ్ చ‌ర‌ణ్ కూడా ఏం చేయలేకపోయేసరికి ఇప్పుడు బాలీవుడ్ బాట పట్టింది ఈ ముద్దుగుమ్మ. గ్లామ‌ర్ షో లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు కృతిక‌ర్బందా. ఇప్ప‌టికీ హీరోయిన్ గా వెలిగిపోదామ‌నే ప్ర‌య‌త్నాలు  చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. అయితే విచిత్రంగా టాలీవుడ్ పొమ్మన్నా.. బాలీవుడ్ మాత్రం రారమ్మని ఆహ్వానం పలుకుతుంది. అక్కడ వరస సినిమాలతో రప్ఫాడిస్తుంది ఈ భామ. ఇప్పటికే అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ 4లో నటించింది. ఇప్పుడు పాగల్ పంటి సినిమాలో కూడా నటిస్తుంది. ఈ చిత్రం నవంబర్ లో విడుదల కానుంది. మరో సౌత్ బ్యూటీ ఇలియానా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్లో సరైన విజయాలు రాకపోయినా కూడా తనకు వచ్చిన అవకాశాల్లో మాత్రం సత్తా చూపిస్తూనే ఉంది ఈ భామ. ఇప్ప‌టికీ అక్క‌డ అవ‌కాశాల కోసం చూస్తూనే ఉంది కృతి. ఇప్పుడు కూడా ఎక్క‌డ ఏ ఈవెంట్ జ‌రిగినా ఉల్లిపొర కంటే ప‌లుచ‌గా ఉండే దుస్తుల్లో క‌నిపిస్తుంది. ఇక మ‌ధ్య‌లో ఫోటోషూట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా హాట్ ఫోటోషూట్ తో పిచ్చెక్కించింది ఈ బ్యూటీ. మరి అక్కడ ఇంకెంతకాలం కెరీర్ నడిపిస్తుందో చూడాలిక.

More Related Stories