మళ్ళీ ఊపందుకున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్

బాహుబలి లాంటి ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మరో ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్. బాహుబలి తరువాత విడుదల అవుతున్న సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమాని వచ్చే యేడాది జూలై 30న విడుదల చెయ్యబోతున్నామని జక్కన్న అప్పట్లో ప్రకటించారు. ఈ సినిమా శూఇంగ్ శరవేగంగా జరుగుతుందట. అయితే రీసెంట్గా రాజమౌళితో పాటు ప్రభాస్, అనుష్క, రానా, నిర్మాతలు ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్లో ‘బాహుబలి: ది బిగినింగ్’ సినిమా స్క్రీనింగ్ కోసం లండన్ వెళ్లారు.
ఇందుకోసం వారం రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. లండన్ నుండి రాజమౌళి తిరిగి రావడంతో షూటింగ్ మళ్ళీ మొదలైనదని అంటున్నారు. తాజా షెడ్యూల్ ఎల్లుండి నుండి హైదరాబాద్‌లో మొదలు కానుందని చెబుతున్నారు. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు పాల్గొంటారని అంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు మరియు ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. అలియ భట్, సముద్ర ఖని, అజయ్ దేవగన్ లు కీలక పాత్రలలో కనిపించనున్న ఈ సినిమాని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. బాహుబలి లాగే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం భాషలలో ఒకేరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.