English   

సాహసం చేస్తున్న కాజల్ పనవుతుందా 

Kajal Aggarwal
2019-10-26 18:03:08

2019 కాజల్ కి కలిసి రాలేదు, ఆమె ఈ ఏడాది చేసిన తెలుసు సినిమాలు అన్ని బోల్తా కొట్టాయి. అసలు ఆ సినిమాలు ఆమె ఎందుకు చేసిందో ఏమో ?  2019లో ఆమె రెండు సినిమాలు చేసింది. ఆ రెండు సినిమాలు ఘోర పరాజయాలుగా నిలిచాయి. ఇక ఆమె ఇప్పుడు భారతీయుడు సినిమా మీదనే ఆశలు పెట్టుకుంది. కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా భారతీయుడు 2. గతంలో వచ్చిన భారతీయుడు చిత్రానికి కొనసాగింపుగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. వివిధ దేశాలలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. 

బ్యూటీ కాజల్ అగర్వాల్ ఈ మూవీలో కమల్ కి జంటగా చేస్తున్న సంగతి తెలిసిందే. కాజల్ ఈ సినిమాతో ఒక సాహసం చేస్తోందట. ఆమె ఈ సినిమాలో 85ఏళ్ల వృద్దురాలిగా కనిపించనుందని అతున్నారు. కమల్ 90ఏళ్ల వృద్దుడిగా చేస్తున్న క్రమంలో ఆయన భార్యగా కాజల్ వృద్దురాలిగా కనిపిస్తుందట. ఇక వీరిద్దరి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్స్ లో ఇద్దరూ యంగ్ గా కనపడతారని అంటున్నారు. 

మొదటి పార్టులో కమల్ భార్యగా వృద్ధురాలి పాత్రలో నటి సుకన్య నటించింది ఆమె స్థానంలోనే కాజల్ తన ప్రతిభ చాటనుంది. ఈ సినిమాలో సిద్దార్థ్, బాబి సింహా, రకుల్‌ ప్రీత్‌సింగ్, వివేక్‌ వెన్నెల కిశోర్‌ వంటి నటులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాంకపై నిర్మితమయ్యే ఈ సినిమాకి శుభకరణ్‌ అలీరాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మరి కాజల్ కి ఈ సినిమా అయినా హిట్ కోరిక తీరుస్తుందేమో చూడాలి మరి.

More Related Stories