English   

సంక్రాంతి బరిలో వెనక్కెళ్ళిన కళ్యాణ్ రామ్

Kalyan Ram
2019-10-26 18:42:29

ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా సంక్రాంతి సందర్భంగా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఇక వీటిలో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలే కాక ఇద్దరూ స్టార్స్ కావడంతో ఈ రెండు సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మహేష్ ఇప్పటికే రెండు వరుస సక్సెస్ లు అందుకుని మంచి జోరుతో ఉన్నాడు. 

అదీ కాక కెరీర్ లో ఇప్పటి వరకు ఒక్క ఫెయిల్యూర్ కూడా లేని అనిల్ రావిపూడి ఈ సినిమాని తనదైన కామిక్ స్టైల్ లో తెరకేక్కిస్తుండడంతో సినిమా మీద అంచనాలున్నాయి. ఇక బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న అల వైకుంఠపురములో సినిమాపై కూడా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇకపోతే వీటితో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎంత మంచివాడవురా సినిమా కూడా ముందుగా అదే రోజు రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించింది. అది ఈ సినిమా ఇప్పుడు వెనక్కి తగ్గింది. 

అయితే విచిత్రం ఏంటంటే ఈ సినిమా వాయిదా పడుతున్నట్టు కాకుండా ఇప్పుడే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినట్టు చేశారు మేకర్స్. నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతోన్న ఎంత మంచివాడవురా సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకుందని ఆఖరి షెడ్యూల్‌ని కేరళలోని మున్నార్‌ లాంటి ప్లేసెస్ లో ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ షూట్‌ చేయనున్నామని అలా షూట్ పూర్తి చేసిన ఈ సినిమాని జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతల పేరిట ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమాని 'ఆదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత ఉమేష్‌ గుప్తా, శివలెంక కృష్ణ ప్రసాద్‌ లు నిర్మిస్తున్నారు.  

More Related Stories