English   

బిగ్ బాస్ నుంచి ఈ వారం యాంకర్ ఔట్.. ఫ్యాన్స్ షాక్..

  Siva Jyothi
2019-10-26 18:50:51

బిగ్ బాస్ 3 చూస్తుండగానే చివరిదశకు వచ్చేసింది. మరో వారం అయితే ఈ షోకు శుభం కార్డ్ పడనుంది. ఇన్నాళ్లుగా ఇంట్లో ఉండటంతో ఒకరిపై ఒకరికి తెలియకుండానే అనుబంధం ఏర్పడింది. అయితే ఒక్కో వారం ఇంటి నుంచి బయటికి వచ్చే ప్రక్రియ మాత్రం ఆగదు కదా. ఇప్పుడు ఈ వారం కూడా ఇదే జరగబోతుంది. మరో వారం మాత్రమే ఉంటుంది. ఇంట్లో ఆరుగురు ఉన్నారు. దాంతో ఈ సారి ఇంటి నుంచి బయటికి ఎవర్ని పంపేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బాబా భాస్కర్, రాహుల్ ఫైనల్ చేరిపోయారు. దాంతో వాళ్లు ఎలిమినేషన్ లిస్టులో లేరు. ప్రస్తుతం బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, రాహుల్, అలీ రెజా మేల్ కంటెస్టెంట్స్ కాగా.. శ్రీముఖి, శివ జ్యోతి ఫీమేల్ కంటెస్టెంట్స్. ఈ వారం శివజ్యోతి ఇంటి నుంచి బయటికి వచ్చేస్తుంది. 14 వారాల లాంగ్ జర్నీ తర్వాత ఇంటిని వదిలేయనుంది ఈ యాంకర్. శ్రీముఖి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. ఇక వరుణ్, రాహుల్ కు కూడా మంచి ఫేమ్ ఉంది. బయట వాళ్లకు మంచి ఇమేజ్ కూడా ఉంది. దాంతో ఈ వారం శివజ్యోతి బయటికి రావడం ఖాయం అయిపోయింది. శ్రీముఖికి బయట టైటిల్ విన్నింగ్ అనే పేరుంది. పైగా తొలి రెండు సీజన్స్ కూడా అబ్బాయిలకే టైటిల్స్ ఇవ్వడంతో ఈ సారి శ్రీముఖికి ఇస్తారని తెలుస్తుంది. మొత్తానికి ఈ సారి జ్యోతి ఎలిమినేట్ అయితే ఐదుగురుతో చివరి వారంలోకి ఎంట్రీ కానున్నాడు బిగ్ బాస్. మరో వారంలో టైటిల్ విన్నర్ ఎవరో తేలనుంది. అంతా శ్రీముఖి అని ఫిక్సైపోతున్నారు. ఆమెకు ఉన్న క్రేజ్.. పాపులారిటీ దీనికి ఉపయోగపడుతుంది. మరి చూడాలిక.. ఏం జరగబోతుందో..?

More Related Stories