English   

సమంతతో ఆడుకుంటున్న స్టార్ హీరోలు..

Samantha.jpeg
2019-10-27 06:51:24

వినడానికి కాస్త విచిత్రంగా ఉంటుంది.. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతుంది మాత్రం ఇదే. పెళ్లి తర్వాత పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు పరిమితం అయిపోయింది సమంత అక్కినేని. కేవలం తన భర్త నాగచైతన్యతో మాత్రమే నటిస్తాను అని క్లారిటీ గా చెప్పింది. అయితే ఇలాంటి సమయంలో మనసుకు నచ్చిన కథలు వస్తే అప్పుడప్పుడు హీరోలతో కూడా నటిస్తానని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది సమంత అక్కినేని.

అన్నట్లుగానే ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న 96 రీమేక్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళనాట ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. విజయ్ సేతుపతి కెరీర్లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది 96. ఒరిజినల్ తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఇక్కడ కూడా 96 రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. తెలుగులో ఈ చిత్రానికి జాను అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. నవంబర్లో సినిమాను విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసినా కూడా అది అన్ సీజన్ కావడంతో వెనక్కి తగ్గుతున్నారు. దానికితోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉండటంతో డిసెంబర్ లో విడుదల చేయాలని అనుకున్నాడు దిల్ రాజు.

కానీ సమంత సినిమాకు వరుసగా స్టార్ హీరోలు అడ్డుగా నిలబడ్డారు. డిసెంబర్ 20న బాలకృష్ణ రూలర్.. సాయి ధరమ్ ప్రతిరోజు పండగే సినిమాలు రానున్నాయి. డిసెంబర్ 25న రవితేజ నటిస్తున్న డిస్కోరాజా విడుదల కానుంది. ఇలా డిసెంబర్ మొత్తాన్ని స్టార్ హీరోలు కబ్జా చేయడంతో 96 రీమేక్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నాడు దిల్ రాజు.

More Related Stories