English   

మీడియా ముందు రానా దగ్గుబాటితో ఆడుకున్న దీపికా పదుకొనే..

Deepika Padukone Raana.jpg
2019-10-27 10:07:31

రానా దగ్గుబాటి కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు.. ఆయన ఇండియన్ స్టార్. కెరీర్ ఆరంభంలోనే తెలుగుతో పాటు హిందీ తమిళ సినిమాలు కూడా చేశాడు రానా దగ్గుబాటి. అందుకే ఆయనకు అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. గుర్తింపు కూడా ఉంది. దానికి తోడు బాలీవుడ్ నటులతో రానాకు మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా హీరోయిన్లతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. తాజాగా ముంబైలో ఒక అవార్డ్ ఫంక్షన్ కు వెళ్లిన రానా దగ్గుబాటితో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గిల్లికజ్జాలు ఆడింది. వీళ్లిద్దరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అవార్డు వేడుకకు వచ్చిన దీపికా పదుకొనే మీడియా ముందు ఫోటోలకు ఫోజులు ఇస్తూ నిలబడింది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రానా దగ్గుబాటి వచ్చాడు. అతడు వచ్చిన విషయాన్ని గమనించిన దీపికా పదుకునే వెళ్లి ప్రత్యేకంగా పలకరించింది. ఆ తర్వాత ఫోటో దిగడానికి బల్లాల దేవుడిని లాక్కొచ్చింది దీపికా పదుకొనే. రానా కాస్త మొహమాటంగా వద్దు వద్దు అంటే కూడా దీపిక బలవంతంగా తీసుకు వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చేలా చేసింది. ఇక ఫోటోలు దిగుతున్న సమయంలో కూడా రానా దగ్గుబాటితో మాట్లాడుతూ కనిపించింది దీపిక. మధ్యలో కెమెరామెన్ ఏదో జోక్ వేస్తే రానాను చేతితో కొడుతూ మరీ నవ్వింది దీపిక.

వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహానికి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది. గతంలో రణబీర్ కపూర్, దీపికా పదుకొనే జంటగా నటించిన ఏ జవానీ హై దివానీ సినిమాలో రానా అతిథి పాత్రలో నటించాడు. దానికి ముందు రానా హీరోగా నటించిన దమ్ మారో దమ్ సినిమాలో దీపికా స్పెషల్ సాంగ్ చేసింది. దాంతో ఇద్దరికీ మంచి స్నేహం కుదిరింది.

అప్పటి నుంచి ఇప్పటివరకు దీపికా రానా దగ్గుబాటి అంత క్లోజ్ గా ఉన్నారు. తాజాగా వీరి స్నేహం మరోసారి బయటపడింది. రానాకు ఉన్నంత గుర్తింపు టాలీవుడ్లో మరో హీరోకు ముంబైలో లేదు.

More Related Stories