English   

మా బాలయ్యకు ఏమైంది.. అభిమానుల ఆందోళన..

Balakrishna Roller.jpg
2019-10-27 15:12:11

బాలకృష్ణది ఏమైంది బాగానే ఉన్నాడు కదా.. సినిమాలు కూడా చేస్తున్నాడు.. ఇప్పుడు ఆయనకు వచ్చిన ప్రమాదం ఏంటి.. అసలు అభిమానులు ఎందుకు కంగారు పడుతున్నారు అనుకుంటున్నారా.. ఉంది దానికి కూడా ఒక కారణం ఉంది. తాజాగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న రూలర్ సినిమా పోస్టర్ విడుదలైంది. అందులో బాలకృష్ణను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

ఎందుకో తెలియదు కానీ ఈ పోస్టర్ లో బాలయ్య కాస్త తేడాగా కనిపిస్తున్నాడు అంటున్నారు అభిమానులు. మొహంలో కూడా మునుపటి కళ లేదనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా బరువు తగ్గటంతో ఎఫెక్ట్ మొహంపై కూడా పడింది అంటున్నారు విశ్లేషకులు. దానికితోడు హెయిర్ స్టైల్ కూడా కాస్త కొత్తగా ట్రై చేయడంతో అది బాలకృష్ణ కు పెద్దగా సూట్ అయినట్లు కనిపించడం లేదు. అందుకే రూలర్ ఫస్ట్ లుక్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. కొందరు బాగుంది అంటే మరికొందరు మాత్రం బాలకృష్ణ అస్సలు సూట్ కాలేదు అంటున్నారు. ఏదేమైనా కూడా ఇదే సినిమా నుంచి ఆ మధ్య విడుదలైన బాలయ్య ఫస్ట్ లుక్ కు కూడా ఇలాంటి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.. కానీ ఆ తర్వాత అవే పోస్టర్లు చూసి మా బాలయ్య అదిరిపోయాడు అన్నారు అభిమానులు.

ప్రేక్షకులు కూడా కొత్తగా ఉంది అంటూ మురిసిపోయారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది చూడండి అంటున్నారు దర్శక నిర్మాతలు. బరువు తగ్గి భారీగా ఉన్న మనిషి కాస్తా.. కాస్త సన్నగా కనబడటంతో అభిమానులు అలా ఫీల్ అవుతున్నారు కానీ రేపు ట్రైలర్ విడుదలైన తర్వాత కచ్చితంగా అది చూసి ఫిదా అయిపోతారు అంటున్నారు చిత్ర యూనిట్. డిసెంబర్ 20న రూలర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.

More Related Stories