English   

దీపావళి సంబరాల్ని రెట్టింపు చేసిన టాలీవుడ్

Tollywood Diwali.jpg
2019-10-28 07:06:41

సినీ అభిమానులకు ఈ సంబరాల్ని రెట్టింపు చేసి, దీపావళి పండగ వాతావరణాన్ని ముందే తెచ్చింది. దీపావళి కానుకగా రిలీజ్ కి రెడీగా ఉన్న, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న అన్ని సినిమా యూనిట్స్ కీలక అప్డేట్స్ అందించి ప్రేక్షకులు, అభిమానుల్లో జోష్ నింపాయి. ఇప్పటికే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పలు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్‌ను అనౌన్స్‌ చేయడంతో పాటు మరికొన్ని చిత్రాల్లోని హీరోహీరోయిన్లతో పాటు ముఖ్య తారాగణం లుక్‌లను విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలతో మొదలెడితే చిన్న సినిమాల నుండి కూడా అప్డేట్స్ వచ్చాయి.

ముందుగా సరిలేరు నీకెవ్వరు విషయానికి వస్తే మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా నుండి దీపావళి సందర్భంగా దాదాపు పదమూడేళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి లుక్‌తో పాటు మహేష్ సింగిల్ పోస్టర్‌, అలాగే మహేష్ తో పాటు హీరోయిన్ రష్మిక కలిసి ఉన్న పిక్ ని విడుదల చేసింది.

అల వైకుంఠపురంలో విషయానికి వస్తే  ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్న సభ్యులందరూ దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది.

డిస్కో రాజా  విషయానికి వస్తే దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ డిస్కో రాజా పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ నభా నటేష్‌తో కనిపించాడు.  

తిప్పరామీసం విషయానికి వస్తే దీపావళి శుభాకాంక్షలు తెలపుతూ ఒక పోస్టర్‌ను విడుదలు చేసింది. శ్రీ విష్ణు రఫ్‌ లుక్‌లో కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ఈ సినిమా నవంబర్‌ 8న విడుదల కానుందని కూడా ప్రకటించారు.  

సూపర్‌ మచ్చి విషయానికి వస్తే విజేత ఫలితం తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న సూపర్‌ మచ్చి. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ హీరో, హీరోయిన్ల పోస్టర్లను యూనిట్ విడుదల చేసింది.  

అశ్వథ్థామ విషయానికి వస్తే నాగశౌర్య, మెహరీన్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమాకి దీపావళి కానుకగా టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.  

బాలకృష్ణ రూలర్‌’ విషయానికి వస్తే  రవికుమార్‌ దర్శకత్వంతో తెరకెక్కుతోన్న సినిమాకు ‘రూలర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ సినిమాలో పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు బాలకృష్ణ. సి. కల్యాణ్, సి.వి. రావ్, పత్సా నాగరాజు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబరు 20న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’. సినిమా నుండి ట్రైలర్‌ విడుదల చేశారు.

సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తున్న ‘ఎంతమంచి వాడవురా’ సినిమా నుండి కూడా ఒక ఫ్యామిలీ పిక్ రిలీజ్ చేశారు. అలా ఈ దీపావళి అనేక సంబరాల్ని తెచ్చింది.

More Related Stories