English   

మంచు మనోజ్ కొత్త ప్రయాణం...ప్రకటించేశాడు !

Manchu Manoj Kumar.jpg
2019-10-28 07:40:46

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్‌ మరో ప్రయోగానికి తెర తీశాడు. ఇప్పటివరకు నటుడిగా అనేక పాత్రలు పోషించిన ఆయన ఇక మీదట రియల్ లైఫ్ లో నిర్మాత పాత్ర పోషించనున్నాడు. టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టారు. ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’పేరిట సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ను ప్రారంభించారు.

దీపావళి పర్వదినాన సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌కు శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందని చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ కొత్త ప్రయాణంలో అందరి ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలు తనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక ప్రొడక్షన్‌ హౌజ్‌కు సంబంధించిన లోగోను కూడా ఈరోజే విడుదల చేశారు. ‘కొత్త జర్నీ ప్రారంభమైంది. నా సొంత ప్రొడక్షన్‌ హౌజ్‌ ‘ఎమ్‌ఎమ్‌ ఆర్ట్స్‌’నిర్మాణంలోనే నా తదుపరి సినిమాలు వస్తాయి. అదేవిధంగా కొత్త టాలెంట్‌ను వెలికితీయాలనే ఉద్దేశంతోనే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాను. భవిష్యత్‌లో మా ప్రొడక్షన్‌ హౌజ్‌ నుంచి వచ్చే మంచి సినిమాలను మీరు చూస్తారు. ఆర్ట్స్‌ తరుపున మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. లవ్‌ యూ ఆల్‌’ అంటూ మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు.

మంచు ఫ్యామీలీకి నిర్మాణ రంగం కొత్తదేమి కాదు. ఇప్పటికే మోహన్ బాబు లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ ఏర్పాటు చేసి పలు చిత్రాలని నిర్మించగా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై మంచు విష్ణు కొన్ని సినిమాలను నిర్మించాడు. ఇక ఇప్పుడు మంచు మనోజ్‌ మరో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించాడు.

More Related Stories