English   

ట్రెండింగ్ లో రామ్ సినిమా...అదేనా....

Hero Ram.jpg
2019-10-28 09:38:02

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే సాధించింది. చాన్నాళ్ళ తర్వాత ఈ సినిమా తో సక్సెస్‌ రావడంతో ఫుల్‌జోష్‌లో ఉన్నాడు రామ్. ఈ సినిమా మొన్ననే 100 రోజులు కూడా పూర్తి  చేసుకుంది. ఇక ఈ ఊపులోనే తమిళంలో అరుణ్ విజయ్ హీరోగా సూపర్ హిట్టైన ‘తడమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా అని ప్రకటించలేదు కానీ కోశోర్ తిరుమలతో సినిమా ఈరోజు ప్రకటన ఉంటుందని చెబుతూ నిన్న ప్రకటించాడు. ఈరోజు సాయంత్రం 4.30 నిమిషాలకు ఫస్ట్ లుక్‌తో పాటు సినిమా టైటిల్‌ను రివీల్ చేయనున్నట్టు ప్రకటించాడు.

రామ్‌కు ఇది18వ సినిమా కాగా #Rapo18 అనేది ట్రేండింగ్ లోకి వెళ్ళింది. కాగా ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తుండగా స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. తడమ్ రీమేక్ అనే ప్రచారం జరుగుతున్నా దాని మీద ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. ఇప్పటికే ‘డబుల్ ఇస్మార్ట్’ అనే పేరు కూడా రిజిస్టర్ చేయించారు. మరి ఈ టైటిల్ పూరీతో రామ్ నటించబోయే తర్వాతి ప్రాజెక్ట్ కోసమా లేక వేరే సినిమా కోసమా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకి ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంగీతం అందించిన మణిశర్మ పనిచేయనున్నారు.

More Related Stories