English   

మంచు ఇంట ప్రభాస్ సందడి...పిక్స్ వైరల్ 

Prabhas
2019-10-28 12:41:47

ప్రభాస్ ఎప్పుడూ మీడియాకి దూరంగా ఉంటారు. సినిమా ఫంక్షన్స్ కి తప్ప పెద్దగా బయట ఫంక్షన్స్ కి హాజరు కారు. కానీ ఆయన నిన్న మంచు విష్ణు ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. అందుకు సంబందించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఏడాది విడుదలైన ‘సాహో’ సినిమా తో హిట్ కొట్టిన ప్రభాస్‌ ప్రస్తుతం ఒక వింటేజ్‌ లవ్‌ స్టోరీలో నటిస్తున్నారు. జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జంటగా పూజా హెగ్డే కనిపించనున్నారు. ఇటీవలే యూరప్‌ లో షూట్ జరుపుకున్న ఈ సినిమాకి బ్రేక్ ఇచ్చారు. 

నిన్న సాయంత్రం మంచు విష్ణు‌ తన ఇంటిలో దీపావళి వేడుకలను ఏర్పాటు చేసి సినిమా ఇండస్ట్రీలో తమ కుటుంబంతో సన్నిహితంగా మెలిగే వారందరినీ ఆహ్వానించినట్లు సమాచారం. కాగా ఈ వేడుకలకు హాజరయిన ప్రభాస్ మంచు ఫ్యామిలీతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు విష్ణు దంపతులతో ప్రభాస్ ఫొటోలు దిగారు. ఈ వేడుకలకు చిరంజీవి, కృష్ణం రాజు, రాఘవేంద్ర రావు సహా మరికొందరు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారట. మోహన్ బాబుతో ప్రభాస్ ‘బుజ్జిగాడు’ సినిమాలో కలిసి నటించాడు. అలాగే కృష్ణం రాజు ఫ్యామిలీకి మంచు ఫ్యామిలీకి కూడా సత్సంబందాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ తో విష్ణు ఫ్యామిలీ దిగిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More Related Stories