English   

ఆ నిర్మాత మీద రానా షాకింగ్ కామెంట్స్...డబ్బు కోసమే అదంతా 

  Rana
2019-10-28 12:58:01

నటుడు రానా నటిస్తున్న ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ లలో ‘1945’ కూడా ఉంది. ఈ సినిమాలో రానా సైనికుడిగా నటిస్తున్నాడని రెండేళ్ళ క్రితం ప్రచారం అయ్యింది.  తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా తమిళంలో 'మదై తీరాతు' పేరుతో రూపొందుతుండగా తెలుగు, హిందీ భాషల్లో '1945' అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతోన్న '1945'లో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఓ సిపాయిగా రానా నటిస్తున్నాడు.

 ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి ఆ తర్వాత ఎటువంటి అప్డేట్ లేదు. ఎస్.ఎం.రాజరాజన్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏమయిపోయిందో తెలీదు. కానీ నిన్న ఉన్నట్టుండి ప్రొడక్షన్ నుండి ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే అది చూసిన రానా స్పందించారు. ఇది అసంపూర్తిగా మిగిలిపోయిన సినిమా అని తాను సంవత్సరంగా సినిమాకు సంభందించిన వారిని ఎవరినీ కలవలేదని, ఇది ఇంకొంతమందిని చీటింగ్ చేసి డబ్బును సమకూర్చుకునే ప్రయత్నమే. 

ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా షాకిచ్చారు. రానా మాటలను పట్టించుకోకుండా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి. ఈ సినిమా విషయమై గతంలో ఆర్థిక లావాదేవీలు సక్రమంగా జరగకపోవడంతో రానా ఆ సినిమా నుండి బయటకు వచ్చేసినట్టు సమాచారం. అందువల్లనే రానా ఈ విధంగా 1945 మూవీపై నెగటివ్ రియాక్ట్ అయినట్లు భావిస్తున్నారు.  

More Related Stories