English   

బిగిల్ కలెక్షన్స్.. కొనసాగుతున్న విజయ్ దండయాత్ర..

 Bigil
2019-10-28 13:10:54

విజయ్ హీరోగా నటించిన విజిల్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ పై దండయాత్ర చేస్తుంది. తేరీ, మెర్సల్ లాంటి సినిమాల తర్వాత అట్లీ కాంబినేషన్ లో విజయ్ నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. తొలి రోజు కాస్త నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా ఈ సినిమాపై వాటికి వస్తున్న కలెక్షన్లపై ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. ముఖ్యంగా తమిళనాట బిగిల్ సంచలన వసూళ్లు సాధిస్తుంది. అక్కడ మూడు రోజుల్లోనే దాదాపు 70 కోట్లకుపైగా గ్రాస్ 50 కోట్లకు చేరువగా షేర్ వసూలు చేసింది. తెలుగులో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. సినిమా సినిమాకు తన మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్నాడు విజయ్. విజిల్ సినిమాకు మూడు రోజుల్లో 6.8 కోట్లు వచ్చాయి. మరో రెండు కోట్లు వసూలు చేస్తే తెలుగులో మరో విజయం అందుకుంటాడు విజయ్. ఆడవాళ్ళ కోసం అంటూ అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం ఎమోషనల్గా బాగానే వర్కౌట్ అవుతుంది. దీపావళి సెలవులు ఉండటంతో విజిల్ ప్రేక్షకులతో విజిల్స్ వేస్తుంది. ఈ సినిమా చూస్తుంటే ఇప్పట్లో తగ్గేలా కూడా కనిపించడం లేదు. కార్తీ నటించిన ఖైదీ సినిమా అద్భుతమైన టాక్ వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో ఏ మాత్రం పోటీ పడలేక పోతుంది. విజిల్ అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోండటం విశేషం. నెగిటివ్ టాక్ వచ్చిందంటే దాన్ని తట్టుకొని మరి విజయ్ తన స్టామినా చూపిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం.

More Related Stories