English   

ఖైదీ రఫ్ ఆడిస్తున్నాడు.. మంచి సినిమాకు మంచి వసూళ్లు..

Khaidi
2019-10-28 16:17:26

కార్తీ ఖైదీ సినిమాకు అద్భుతమైన టాక్ వచ్చింది. గత కొన్నేళ్లలో ఇలాంటి సినిమా చూడలేదు అంటూ విశ్లేషకుల తో పాటు ప్రేక్షకులు కూడా తేల్చిచెప్పారు. ఒకే రాత్రిలో జరిగే కథను దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ ఈయనపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక దానికి తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర ఖైదీ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుంది. భారీ కలెక్షన్లు రాలేదు కానీ రోజురోజుకు వసూళ్ళు పెంచుకుంటూ వెళ్తున్నాడు కార్తీ. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు కేవలం 60 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది ఖైదీ సినిమా. కానీ ఆ తర్వాత రెండు రోజుల్లో కోటికి చేరువగా వచ్చాయి కలెక్షన్లు. ముఖ్యంగా మూడవ రోజు దీపావళి పండుగ కావడంతో కలెక్షన్లకు రెక్కలొచ్చాయి. సినిమా ఎంత అద్భుతంగా ఉన్నా కూడా కమర్షియల్ అంశాలు లేకపోవడం దీనికి కాస్త మైనస్ గా కనిపిస్తుంది. అందుకే ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే ఖైదీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఏదేమైనా కూడా మూడు రోజుల్లో తెలుగు తమిళ భాషల్లో కలిపి దాదాపు 30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఖైదీ. బాక్సాఫీస్ దగ్గర విజయ్ వీరవిహారం చేస్తుండటంతో ఖైది హవా కాస్త తగ్గింది.

More Related Stories