English   

చిరంజీవి మనసులోని ఆ ఇద్దరు కుర్ర దర్శకులు..

chiranjeevi
2019-10-28 17:17:17

మెగాస్టార్ చిరంజీవి సైగ చేయాలి కానీ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి దర్శకుడైన ఆయన దగ్గరికి రావాల్సిందే.. నచ్చేలా కథ చెప్పాల్సిందే. మెగాస్టార్ తో పని చేసే అవకాశం కోసం తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ తరం దర్శకులు అయితే చిరంజీవితో సినిమా చేయడమే తన జీవితం లక్ష్యం అంటున్నారు. ఆయనతో సినిమా అంటే వచ్చే కిక్ అలా ఉంటుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీ లో ఇద్దరు దర్శకులతో సినిమా చేయాలని కోరుకుంటున్నాడు. 

ఆయన మనసులో ఈ కోరిక చాలా బలంగా ఉంది. చిరంజీవి మనసును అంతగా దోచుకున్న ఆ ఇద్దరు దర్శకులు అనిల్ రావిపూడి హరీష్ శంకర్. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ఈ ఇద్దరు దర్శకులు. వాళ్లతో ఒక సినిమా చేయాలని చిరంజీవి భావిస్తున్నాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ లోనే హరీష్ శంకర్ తో తనకు సినిమా చేయాలని ఉందని చెప్పాడు మెగాస్టార్. అయితే అప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు దాంతో ఆ కాంబినేషన్ రాదు అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. కానీ ఇప్పుడు చిరంజీవి తలుచుకుంటే ఈ కాంబినేషన్ మళ్లీ రెడీ అవుతుంది.

ఇక వరుస విజయాలతో తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తున్న అనిల్ రావిపూడితో కూడా ఒక సినిమా చేయాలనుకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఆయన కామెడీ టైమింగ్ చిరుకు చాలా ఇష్టం అని తెలుస్తోంది. ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నాడు అనిల్ రావిపూడి. చిరంజీవి అడగాలే కానీ ఆరు నెలల్లో కథ సిద్ధం చేసి మరో ఆరు నెలల్లో సినిమా పూర్తి చేస్తాడు అనిల్. మరి ఇద్దరు దర్శకులతో మెగాస్టార్ సినిమా ఎప్పుడు ఉండబోతుందో చూడాలి.

More Related Stories