రామ్ చరణ్ ను చంపి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన కాజల్..

వినడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. కాజల్ అగర్వాల్ నోటి నుంచి వచ్చిన మాటలు ఇవి. చెల్లికి పెళ్ళి ఆమె తల్లి అయిన తర్వాత కూడా ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉంది కాజల్ అగర్వాల్. తన పెళ్లి గురించి ఏమాత్రం పట్టడం లేదు. అభిమానులు అడిగిన ప్రతిసారీ త్వరలోనే చేసుకుంటాను అని చెబుతోంది కానీ ఆ త్వరలో ఎప్పుడు అనేది మాత్రం చెప్పడం లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక హీరోతో ఆమె రిలేషన్ లో ఉంది. రెండేళ్ల తర్వాత వాళ్ళు విడిపోయారు. అప్పట్లో ఈ విషయం పై కాజల్ కూడా నోరు విప్పింది. ఆ హీరో ప్రభాస్ అనే వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపించాయి. పదేళ్ల కింద ఆయనతో కలిసి డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేసింది కాజల్ అగర్వాల్. ఆ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారిందని ఇండస్ట్రీలో ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత ఎప్పుడూ మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటించలేదు. ఇక చాలా రోజుల తర్వాత ఇప్పుడు ప్రభాస్ గురించి మళ్ళీ మాట్లాడింది కాజల్. తాజాగా మంచు లక్ష్మి టాక్ షో కు వచ్చిన ఈమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
రామ్‌చరణ్, తారక్, ప్రభాస్‌లలో 'ఎవరిని చంపుతారు? ఎవరితో రిలేషన్లో ఉంటారు..? ఎవరిని పెళ్లి చేసుకుంటారని మంచు లక్ష్మి సరదాగా ప్రశ్నించగా.. అంతే సరదాగా రామ్‌చరణ్‌ను చంపేస్తానని.. తారక్‌తో రిలేషన్లో ఉంటానని.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కాజల్ చెప్పుకొచ్చింది. దానికి కారణం కూడా చెప్పింది కాజల్. రామ్ చరణ్, ఎన్టీఆర్లకు ఇప్పటికే వివాహం కాగా.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ప్రభాస్ కనపడటంతో కాజల్ అటువైపే ఓటేసింది. ఈ ముగ్గురు హీరోలతోనూ కాజల్ ఆడిపాడింది. రామ్ చరణ్‌తో మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే, ఎవడు.. ఎన్టీఆర్‌తో బృందావనం, బాద్షా.. ప్రభాస్‌తో డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాల్లో కాజల్ నటించింది. అందరు హీరోలతోనూ తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని చెబుతోంది కాజల్