English   

కేరళకి మహేష్...అందుకే !

mb
2019-10-29 05:34:28

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి దీపావళి కానుకగా రష్మిక మందన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నేనూ నా ఫ్యామిలీ నన్ను చూడటానికి వచ్చిన 101 నవ పెళ్లికొడుకుని ఎలా హ్యాండిల్ చేస్తామో అంటూ ఈ పోస్టర్ ను పోస్ట్ చేసింది. దానికి ఒక రోజు ముందే విజయ శాంతి లుక్ కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్‌బాబు నిర్మాతలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ద్వారా పదమూడేళ్ల తరువాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తోంది. 

ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న సినిమా -నవంబర్ 4నుంచి నెలాఖరు వరకు తమిళనాడు, కేరళలో జరిగే ఔట్‌డోర్ షెడ్యూల్‌తో షూటింగ్ ముగించనుంది. ఇక దసరాకి ఒక లుక్, దీపావళికి 3 పోస్టర్లు విడుదల చేసిన ఈ యూనిట్ ఓ వీడియోని వదిలారు కూడా. ఈ వీడియోలో సుబ్బరాజు, వెన్నెల కిశోర్ లు స్టోరీ చెప్పేస్తున్నట్టు ఉండగా సడెన్ గా దర్శకుడు అనిల్ రావిపూడి ఎంటరయ్యి ‘ఇప్పటికే లీక్ లతో చస్తుంటే.. మీరు ఏకంగా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం చెప్పేస్తున్నారు’ అంటూ చెప్పడం కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారని అనిపించింది. సంక్రాంతి పండుగకి ఇంకా చాలా రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పుడే ప్రమోషన్లు మొదలెడితే బెటరనుకున్నారో ఏమో ?

More Related Stories