ఏపీ స్పీకర్ గా అలీ....

వివాదస్పాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కమ్మ రాజ్యంలో కడపరెడ్లు’ సినిమా టైటిల్ పై ముందు నుంచి వివాదం నడుస్తోంది. ఈ సినిమా పేరు రెండు సామాజిక్ వర్గాల మధ్య చిచ్చు రేపే విధంగా ఉందని ముందు నుంచి ఆరోపణలున్నాయి. తాజాగా ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో పాటు కథపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. అనంతపురం టూటౌన్ పోలీసులకు కాంగ్రెస్ నేత ఒకరు ఈ టైటిల్‌పై నిషేధం విధించాలని ఫిర్యాదు చేశారు.
కులాల మద్య గొడవల సృష్టిస్తూ సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సినిమా టైటిల్ ఉందని పేర్కొన్న ఆయన టైటిల్ నిషేధించడంతో పాటు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక పోతే ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు వర్మ. ఈ సినిమాలో అలీ ఏపీ స్పీకర్ పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ప్రస్తుత ఏపీ స్పీకర్ తమ్మినేని సీతా రామ్ పాత్రను అలీ పమ్మినేని రామ్ రామ్ అనే పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో చంద్రబాబును టార్గెట్ చేసిన వర్మ ఈ సినిమాతో కూడా ఆయన్నే టార్గెట్ చేసినట్టు చెబుతున్నారు.