నాగబాబు పుట్టినరోజున మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమి చేసినా వివాదమే ఈ మధ్య 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే సినిమాకు సంబందించిన ట్రైలర్‌ను విడుదల చేసిన వర్మ ఇప్పుడు మరో సంచలనానికి తెర లేపాడు. 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా తర్వాత తాను 'మెగా ఫ్యామిలీ' టైటిల్‌తో ఓ సినిమా తీస్తానని నిన్న రాత్రి ప్రకటించాడు. అంతేకాదు 'మెగా ఫ్యామిలీ' సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు 9.36కి వెల్లడిస్తానని ట్విట్టర్ వేదికగా పేర్కోన్నారు. అయితే వర్మ కొత్త సినిమా ప్రకటనతో సినీ అభిమానుల్లో మెగా అభిమానుల్లో ఉత్కంట నెలకొంది.
ఒకప్పుడు పవన్ ని తన ట్వీట్స్ తో చీల్చి చెండాడిన వర్మ ఆ తర్వాత పవన్ ని ఏమీ అననని ఒట్టు పెట్టుకున్నాడు కూడా. ఆ తర్వత కూడా వర్మ పవన్ ని మెగా ఫ్యామిలీని ఏదో ఒకటి అంటూనే వచ్చాడు. ఈ క్రమంలో ఇప్పుడు వర్మ మళ్ళీ మెగా ఫ్యామిలీ ని ఎందుకు టార్గెట్ చేశాడు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. మెగా ఫ్యామిలీని టైటిల్ వరకే పరిమితం చేస్తాడా? లేక నిజమైన మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సినిమా చేస్తాడా? అన్నది మరో గంటలో తేలిపోతుంది. వర్మ మెగాఫ్యామిలీ మీద చేసిన కామెంట్స్ కి మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్లు వేశారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు నాడే వర్మ ఈ ప్రకటన చేయడం ఎంత రచ్చకి దారి తీస్తుందో ?