English   

భారతీయుడు సెట్స్ కి బాలీవుడ్ స్టార్...నాని హీరోయిన్ కూడా 

Ajay Devgn
2019-10-29 10:19:53

విలక్షణ నటుడు కమల్ హాసన్‌ లీడ్ రోల్ లో సంచలనాల దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఇండియన్‌ -2’. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాని తెలుగులో భారతీయుడు-2 గా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మధ్య ప్రదేశ్ లో జతుగుతోంది. ఆ మధ్య బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌.. కమల్‌ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారన్న వార్తలు హల్‌చల్‌ చేశాయి.కానీ అదేం నిజం కాదని తేలిపోయింది. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అజయ్ దేవగన్ నటిస్తున్నారు.

 అందుతున్న సమాచారం ప్రకారం కాగా సినీవర్గాల సమాచారం మేరకు ఈ షెడ్యూల్ కాకుండా వచ్చే షెడ్యూల్ లో అజయ్ దేవగన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కూడా సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.  త్వరలో జరగబోయే షెడ్యూల్ లో ప్రియాంకా అరుళ్ మోహన్ కూడా షూట్ లో పాల్గొంటుందట. 

కమల్ హాసన్ ఈ సినిమా కోసం తన టైం మొత్తం కేటాయిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ నటిస్తోండగా ఆమెతో పాటు మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్‌ కూడా నటించబోతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, అలాగే ప్రియా భ‌వాని కూడా భారతీయుడు సీక్వెల్‌ లో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. 2020లో విడుదల కానున్న ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

More Related Stories