English   

రామ్ గోపాల్ వర్మ మళ్లీ మెగా ఫ్యామిలీని గోకేసాడు.. 

Ram gopal Varma
2019-10-29 16:35:46

సంచలనాలకు కేంద్రబిందువు రామ్ గోపాల్ వర్మ. ఈయన ఎక్కడుంటే అక్కడ కాంట్రవర్సీలు ఉంటాయి. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం ఈయన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర ట్రైలర్ కూడా విపరీతంగా ట్రెండ్ అయింది. సంచలనాలకు నెలవుగా మారుతుంది. ఇందులో కావాల్సినన్ని కాంట్రవర్సీలకు ప్లేస్ ఇచ్చాడు వర్మ. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రంతో మరోసారి పూర్తిగా ఫామ్ లోకి వచ్చేసాడు వర్మ. ఇలాంటి సమయంలో 'మెగా ఫ్యామిలీ' అనే టైటిల్‌ను అనౌన్స్ చేసి ఇదే తన తర్వాతి సినిమా అంటున్నాడు వర్మ. దాంతో వర్మ మళ్లీ కావాలనే చిరంజీవి ఫ్యామిలీని గెలుకుతున్నాడంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ సినిమా ఏమై ఉంటుంది అని ఆలోచించేలోపే మరో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ. తాను 'మెగా ఫ్యామిలీ' సినిమా చేయడం లేదని ప్రకటించారు. అసలు ఈ చిత్రం కాన్సెప్ట్ ఏంటంటే.. ఓ వ్యక్తికి 39 మంది సంతానం ఉంటారు. చాలా మంది పిల్లలు ఉన్నారు కాబట్టి.. నేను చిన్న పిల్లలపై సినిమాలు చేయను కాబట్టి.. ఈ సినిమాను చేయకూడదని నిర్ణయించుకున్నానంటూ ట్వీట్ చేసాడు. ఈయన కావాలనే చిరంజీవి కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తున్నాడంటూ వర్మపై మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. ఈ కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు కాబట్టి ఇలా చేస్తున్నాడంటున్నారు వాళ్లు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇదంతా వర్మ చేస్తున్నాడంటూ ఫైర్ అవుతున్నారు అభిమానులు. మొత్తానికి ఎవరేం అనుకున్నా కూడా తను అనుకున్నది అనుకున్నట్లు చేస్తున్నాడు ఆర్జీవి. 

More Related Stories