English   

యువ నటున్ని బలి తీసుకున్న రోడ్డు ప్రమాదం.. 

Mano dies
2019-10-29 18:05:37

దివాళి రోజే ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. తమిళ యువ నటుడు మనో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈయన ఓ ప్రముఖ చానెల్ లో యాంకర్.. దాంతో పాటు సినిమా నటుడు కూడా. పుగల్ అనే సినిమాతో తమిళ ఆడియన్స్ కు బాగా చేరువయ్యాడు మనో. ఈ ప్రమాదంలో అతడి భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో ప్రస్తుతం చావు బతుకుల్లో ఉంది. ఈమెకు నయం కావాలంటూ కుటుంబ సభ్యులు దేవుళ్లకు ప్రార్థన చేస్తున్నారు. నటనతో పాటు మిమిక్రీలోనూ మంచి ప్రతిభ సంపాదించాడు మనో. ఇంత చిన్న వయసులో రోడ్డు ప్రమాదంలో ఆయన చనిపోవడంతో తమిళ సినీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అంతా ఆయన మరణానికి సంతాపం తెలియచేస్తున్నారు. తన భార్యతో కలసి దీపావళి రోజు చెన్నైలో వెళ్తుండగా సెంటర్ మీడియమ్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మనో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మనో అక్కడిక్కడే చనిపోయాడు. అతడి భార్యను స్థానికులు ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరగా విలపిస్తున్నారు. వీళ్లకు ఏడేళ్ల పాప కూడా ఉంది. ఓ వైపు తండ్రి చనిపోయి.. మరోవైపు తల్లి చావుబతుకుల్లో ఉండగా.. ఆ కుమార్తెను చూసి బంధువులు కంటతడి పెట్టుకుంటున్నారు. మనో మరణంపై తమిళ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలుపుతున్నారు సెలెబ్రిటీస్. 

More Related Stories