English   

అల్లు అర్జున్ సుకుమార్ సినిమా రేపే ప్రారంభం...విలన్ ఆయనేనా

alluarjun
2019-10-29 20:22:45

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ‘అల... వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 విడుదలయ్యేందుకు ఈ సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే బన్నీ తన తదుపరి సినిమా మొదలు పెడతాడని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి తగ్గట్టే సుకుమార్‌తో ఇరవయ్యవ చిత్రాన్ని ఏనాడో ప్రకటించిన అల్లు అర్జున్‌ ఇప్పటిదాకా మొదలు పెట్టలేదు.

ఎట్టకేలకు అల్లు అర్జున్‌ సుకుమార్‌ చిత్రానికి రేపు కొబ్బరికాయ కొట్టనుంది యూనిట్. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ ని నడిపించే వ్యక్తిగా కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ లుక్ పూర్తిగా మార్చేసి లుంగీతో ఊరమాస్ గా కనిపించనున్నాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో తమిళ క్రేజీ హీరో విజయ్ సేతుపతిని విలన్ పాత్రకు అనుకునట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

More Related Stories