English   

నాగార్జున పరిస్థితేంటి.. బిగ్ బాస్‌తో హిట్ కొట్టాడా..

nag
2019-10-30 05:15:08

చూస్తుండగానే బిగ్ బాస్ సీజన్ 3 కూడా చివరికి వచ్చేసింది. ఈ వారంలోనే బిగ్ బాస్ ముగిసిపోనుంది. 104 రోజుల పాటు ఇంట్లో కంటెస్టెంట్స్ ప్రయాణం మరో మూడు నాలుగు రోజుల్లోనే ముగియనుంది. ఇక నాగార్జున కూడా హోస్టుగా ఏం చేసాడనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు ప్రేక్షకులు. ఈయన అసలు సక్సెస్ అయ్యాడా లేదా అనేది లెక్కలు కడుతున్నారు. ముఖ్యంగా హిందీలో అయితే మొదట్నుంచి కూడా సల్మాన్ ఖాన్ ఒక్కడే స్టాండర్డ్ హోస్టుగా సంచలనాలు సృష్టిస్తున్నాడు. కానీ తెలుగులో అది రాలేదింకా. తొలి సీజన్ జూనియర్ ఎన్టీఆర్.. రెండోది నాని.. ఇప్పుడు మూడోది నాగార్జున చేయడంతో ఎవరూ తమ మార్క్ వేయలేకపోతున్నారు. తొలి సీజన్ లో ఎన్టీఆర్ షో చూసి వచ్చి హోస్ట్ చేసేవాడు.. అతడు చూసాడో లేదో పక్కనబెడితే అలాగే ఉండేది ఆయన హోస్టింగ్. నాని కూడా మ్యాగ్జిమమ్ కవర్ చేసాడు. కానీ నాగార్జున విషయంలో అది జరగలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన హోస్టింగ్‌ లోనే ఆ ప్రభావం కనిపించింది.

ముఖ్యంగా షో చూడకుండా కేవలం స్క్రిప్ట్‌ రైటర్లు, దర్శకులపై ఆధారపడి షో నడిపించాడు నాగ్. మధ్యలో కొన్నిసార్లు తప్పు చేసిన వాళ్లను కాకుండా పక్కవాళ్లను తిట్టడం కూడా నాగార్జునపై విమర్శలు తీసుకొచ్చింది. ముఖ్యంగా బాబా భాస్కర్‌ని ఫేక్‌ మనిషిగా చూపించడం.. శ్రీముఖిని మంచిదానిలా మార్చడం ఇవన్నీ దర్శకులు చేసిన పనే.. అదే నాగ్ కూడా చేసాడు. షోలో ఏం జరుగుతుందో తెలియకపోవడంతోనే ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఇవేం పట్టించుకోకుండా నాగార్జున హోస్టింగ్ చేసాడనేది కొందరు చెబుతున్న మాట. మొత్తానికి సీజన్ ముగింపు దశకు వచ్చేస్తుండటంతో నాగార్జున హోస్టింగ్ పై కమెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి.

More Related Stories