English   

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు షాకిచ్చిన సినిమా అది..

rag
2019-10-30 05:29:26

తెలుగు ఇండస్ట్రీలో శతాధిక చిత్రాల దర్శకులు అరుదుగా ఉన్నారు. అందులో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్యులు. ఆయన తెరకెక్కించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను అందుకున్నాయి. తెలుగు సినిమా గతిని మార్చేసిన దర్శక దిగ్గజాల్లో ఆయన కూడా ఒకరు. ఎంతోమంది హీరోలను స్టార్స్ గా మార్చేసిన ఘనత ఈయన సొంతం. అలాంటి దర్శకుడికి విజయాలు, అపజయాలు కొత్త కాదు. హిట్ వచ్చినపుడు ఎంతగా సంతోషిస్తాడో.. ఫ్లాప్ వచ్చినపుడు అంతే బాధ పడతాడు కూడా. తన ప్రయత్నం ఎక్కడో తేడా కొట్టిందని తెలుసుకుని తర్వాత సరిదిద్దుకున్నాడు దర్శకేంద్రుడు. అయితే ఒక్క సినిమా విషయంలో మాత్రం ఈయన ఇప్పటికీ బాధ పడుతూనే ఉంటాడు. అదే 'నిండు నూరేళ్లు' సినిమా. ఈ సినిమాను తాను ఎంతో ఇష్టంతో తీశానని..

కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తూ తాను ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పాడు రాఘవేంద్రుడు. ఈ చిత్రంలో జయసుధ, మోహన్ బాబు, సత్యనారాయణ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తప్పకుండా సూపర్ హిట్ అవుతుందని అనుకున్నానని.. కానీ ఊహించని విధంగా అత్యంత దారుణంగా ఫ్లాప్ అయిందని గుర్తు చేసుకున్నాడు దర్శకేంద్రుడు. అంతగా నమ్మకం పెట్టుకున్న సినిమా ఓ మాదిరిగా కూడా ఆడకపోవడంతో బాధ పడ్డానని.. ఆ సినిమా పరాజయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పాడు రాఘవేంద్రరావు. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో ఆత్మపరిశీలన చేసుకుని.. తర్వాత ఆ తప్పు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పాడు ఈయన. తాజాగా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు ఈ దర్శక దిగ్గజం.

More Related Stories