English   

కార్తీక దీక్షలో పవన్....గోపాలుడిగా మారి

Pawan Kalyan
2019-10-30 09:19:17

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గోవులన్నా మొక్కలన్నా ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజకీయాల మధ్యలో ఏమాత్రం సమయం చిక్కినా ఆయన వాటికి సమయం కేటాయిస్తారు. తాజాగా ఆయన తన ఫామ్‌హౌస్‌లో ఉన్న గోవుల మధ్య ఆయన ఉల్లాసంగా గడిపాడు. అంతేకాకుండా, ఆవులకు అరటిపండ్లను స్వయంగా తినిపించారు. ఆయన చేతుల్లో ఉండే అరటి పండ్లను అందుకునేందుకు ఆవులో పోటీపడ్డాయి. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్‌కు ఫాం హౌస్ ఉన్న విషయం తెల్సిందే. 

అక్కడ పెద్ద సంఖ్యలో గోవులను కూడా పవన్ పెంచుతున్నారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఒక గోశాలను కూడా నిర్మించారు. ఈ క్రమంలో గోశాలను సందర్శించిన సందర్భంగా గోవులతో ఉల్లాసంగా గడిపారు. ఆవులు అరటిపండ్లు అందుకునేందుకు ఎంత తొందరపడుతున్నాయో చూడండి అంటూ మురిపెంగా ట్విట్టర్‌లో తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఇక జనసేన తరపున చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమానికి 'వన రక్షణ' అనే పేరు పెట్టారు పవన్. వన రక్షణ కార్యక్రమానికి నిన్న కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా శ్రీకారం చుట్టారు.  

తన ఫాం హౌస్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వన రక్షణ కార్యక్రమానికి ముందు శాస్త్రోక్తంగా పూజాదికాలు నిర్వహించారు. అలాగే పవన్ కళ్యాణ్ కార్తీక మాస దీక్షను చేపట్టారు. ఈ నెల అంతా ఆయన ఘనాహారం(అన్నం వగైరాలు) స్వీకరించరు. ద్రవాహారం(జ్యూస్ లు, పండ్ల రసాలు) మాత్రమే తీసుకుంటారని సమాచారం. ఇక ప్రతి జనసేన నాయకుడు, జన సైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలని పవన్ కళ్యాన్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని పెంచి సంరక్షించడం కూడా మనందరి బాధ్యతని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

More Related Stories