రామ్ రెడ్ కి కొబ్బరికాయ కొట్టేశాడు...రిలీజ్ కూడా

చాలా కాలంగా హిట్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్టు కొట్టాడు. అసలు హిట్టే లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో తన కెరీర్లోనే ఇదే బిగ్గెస్ట్ హిట్ అందుకుని అత్యధిక వసూళ్లు అందుకుంది. ఆ విజయానందంలోనే ఈరోజు మరో సినిమాకి కొబ్బరి కాయ కొట్టాడు. రామ్ కథానాయకుడిగా స్రవంతి మూవీస్ బ్యానర్ మీద `రెడ్` అనే సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఈ లుక్‌లో ఊర మాస్‌గా కనిపిస్తున్నాడు రామ్.
నవంబర్ 16వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో రామ్ డ్యుయల్ రోల్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అందులో ఒక హీరోయిన్ గా మాళవిక శర్మను రెండో హీరోయిన్ గా నివేద పేతురాజ్ ను ఎంపిక చేసుకున్నట్టుగా సమాచారం. డిఫరెంట్ లుక్ తో రామ్ కనిపించనున్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. తమిళ సూపర్ హిట్ తడమ్ సినిమాకి ఇది రీమేక్. కథలో భారీ మార్పులు చేర్పులూ చేసినట్టు తెలుస్తోంది. 2020 వేసవిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.