English   

శృతి హాసన్ రీ ఎంట్రీ.. రవితేజ సినిమాతో కమ్ బ్యాక్.. 

 Shruti Haasan
2019-10-30 14:01:26

రెండేళ్లుగా తెలుగు సినిమాల్లో అస్సలు కనిపించడం లేదు శృతి హాసన్. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్లీ నటన వైపు వస్తుంది ఈ ముద్దుగుమ్మ. మాస్ మహారాజా రవితేజ 66వ సినిమాను దివాళి సందర్భంగా ఈ మధ్యే ప్రకటించారు. కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. డాన్ శీను, బలుపు తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్‌లో ఈ సినిమా వస్తుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. 2017లో చివరగా కాటమరాయుడు సినిమాలో నటించింది శృతి హాసన్‌.. ఇప్పుడు రవితేజ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వనుంది. గతంలో రవితేజతో కలిసి బలుపు సినిమా చేసింది ఈమె. ఆ సినిమాను కూడా గోపీచంద్ మలినేని తెరకెక్కించడం విశేషం. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక ఇఫ్పుడు రవితేజ సినిమా కోసం పక్కా కమర్షియల్ కథ వండుతున్నాడు గోపీచంద్. అన్ని వర్గాలకు నచ్చేలా ఈ కథ ఉంటుందంటున్నాడు ఈ దర్శకుడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీతో వస్తున్నారు గోపీచంద్ మలినేని. బి మధు ఈ చిత్రానికి నిర్మాత. నవంబర్‌లో సినిమా ఓపెనింగ్ జరగనుంది. మిగిలిన వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు. 

More Related Stories