English   

చిరు  కొరటాల సినిమా రిలీజ్ లాకయ్యిందా 

Chiranjeevi Koratla siva
2019-10-30 15:01:22

చిరంజీవి హీరోగా నటించిన ఆయన 151 వ సినిమా సైరా నరసింహారెడ్డి తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజయిన ఈ సినిమా మిగతా భాషల్లో అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే తన తర్వాత సినిమా కూడా చిరు మొదలు పెట్టేశారు. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను కొరటాల శివ తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను నవంబర్‌ మొదటి వారంలో మొదలుపెట్టి కంటిన్యూ మార్చి నాటికి షూటింగ్ పూర్తి చేస్తుండేలా ప్లాన్ చేశారు. 

ఆ సినిమాని సమ్మర్ కి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హీరోయిన్ ఇంకా ఫైనల్ కాని ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత ద్వయం అతుల్-అజయ్ మ్యూజిక్ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా దేవాలయాలలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో సమ్మర్ రిలీజ్ సిన్మాలు మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అందుకే కొరటాల సినిమా వేసవిలోనే ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్‌ లో దర్శకుడు కొరటాల శివ ఏ హీరోతో సినిమా చేసినా అవన్నీ బ్లాక్‌బస్టర్ మూవీస్‌ గా నిలిచాయి. కొరటాల సోషల్ మెసేజ్ కి తోడు మెగా స్టార్ స్టైల్ తోడయితే ఈ సినిమా ప్రేక్షకులను అలరించడం ఖాయమని భావిస్తున్నారు.

More Related Stories